వ్యాపారంలో ట్రాక్టర్ షోరూమ్ వృద్ధి చెందాలి
1 min read
ట్రాక్టర్ షోరూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే..
నందికొట్కూరు న్యూస్ నేడు: వ్యాపార రంగంలో ట్రాక్టర్ షోరూమ్ రానున్న రోజుల్లో అభివృద్ధి చెందాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో మార్కెట్ యార్డ్ ఎదురుగా జీకే కాంప్లెక్స్ లో టీడీపీ క్లస్టర్ ఇంచార్జి నాగలూటీ సంపంగి రవీంద్ర బాబు ఆహ్వానం మేరకు నూతనంగా ఏర్పాటు చేసిన పవర్ ట్రాక్ ట్రాక్టర్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై గురువారం షోరూంను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,ఏఎంసీ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, సంపంగి రమేష్,తమిదెల రమణారెడ్డి,నాగేంద్ర,భూపాల్ రెడ్డి,శేషి రెడ్డి,ముర్తు జావలి, నాగ సురేష్ తదితరులు పాల్గొన్నారు.


