ఉపాధ్యాయుల కఠోర శ్రమతోనే ఎపిఆర్ జెసి ఫలితాల్లోనూ ప్రతిభ చూపిన విద్యార్థులు
1 min read
మరోసారి సత్తా చాటిన ఏనుగుమర్రి విద్యార్థులుఎ.గీతాలహరి,బి.
శివకుమార్
మొన్నటి జిల్లా స్థాయి చెకుముకి పరీక్షల్లో జిల్లా టాపర్స్ గా,నిన్నటి పదవతరగతి ఫలితాల్లో ప్యాపలి మండల టాపర్ గా,ఈరోజు ఎపి ఆర్ జెసి ఫలితాల్లోనూ ప్రతిభ చూపి ఏనుగుమర్రి ఉన్నత పాఠశాల
ప్యాపిలి న్యూస్ నేడు: ఉపాధ్యాయుల కఠోర శ్రమతోనే ఎపిఆర్ జెసి ఫలితాల్లోనూ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు యు.ఎం. రాజశేఖర్ అన్నారు.రాష్ట్రప్రభుత్వం ఇటీవల విడుదలజేసిన ఎపి ఆర్ జెసి ఎంట్రన్స్ ఫలితాలలో ప్యాపిలీ మండలానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల ఏనుగుమర్రి విద్యార్థులు ఎం.గీతాలహరి,బి.శివకుమార్ లు సీట్లు సాధించి మరొకసారి పాఠశాల తరపున ప్రతిభ చాటారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు యుఎం. రాజశేఖర్ మాట్లాడుతూ పదవ తరగతి ప్రారంభం నుండే విద్యార్థులకు నిపుణులైన మా ఉపాధ్యాయులు ఎపి ఆర్ జెసి ఎంట్రన్స్ పట్ల మెలకువలు నేర్పించడం వలన ఈ ఫలితాలు సాధ్యమయ్యాయన్నారు.మొన్నటి జిల్లా స్థాయి చెకుముకి పరీక్షల్లో జిల్లా టాపర్స్ గా,నిన్నటి పదవతరగతి ఫలితాల్లో ప్యాపలి మండల టాపర్ గా,ఈరోజు ఎపి ఆర్ జెసి ఫలితాల్లోనూ ప్రతిభ చూపి ఏనుగుమర్రి ఉన్నత పాఠశాల స్థాయిని జిల్లా స్థాయి వరకు తీసుకెళ్లినారు, అంటే దానికి మా పాఠశాల ఉపాధ్యాయుల కఠోర శ్రమనే కారణం అని అన్నారు.ఈ సందర్బంగా ఏనుగుమర్రి గ్రామస్తులు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయబృందం ను అభినందించడమైనది.ప్రతిభ చాటిన పిల్లలను ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ మరియు ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు.

