ఉపాధి’చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు
1 min read
పని ప్రాంతంలో కూలీలకు కనపడని సౌకర్యాలు
గుడిపాడు’లో ఉపాధి కూలీలతో పిక్కిలి వెంకటేశ్వర్లు..
నందికొట్కూరు న్యూస్ నేడు: ఉపాధి హామీ పథకాన్నికేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని కూలీలకు కుటుంబానికి రెండు వందల రోజుల పని దినాలు కల్పించాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని గుడిపాడు గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ఉపాధి పనుల దగ్గర గతంలో కూలీలకు మజ్జిగ,మెడికల్ కిట్లు,నీడలో కూర్చోవడానికి టార్పాలిన్ పట్టా ఉండేవని ఇప్పుడు అలాంటివి ఏమీ లేవని మండిపడ్డారు.వేసవి అలవెన్స్,పనిముట్లు,కనీస వసతులు లేవన్నారు.కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.నరేంద్ర మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే విధంగా చర్యలు తీసుకుంటోందని ఉపాధి హామీ చట్టం ద్వారా గ్రామీణ పేదలకు కల్పించాల్సిన హక్కులను నిర్వీర్యం చేస్తూ గ్యారెంటీ ఉపాధిని గ్యారెంటీ లేకుండా మార్చారని అన్నారు.పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీలకు రోజుకు కనీసం 6 వందల కూలీ చెల్లించాలని అన్నారు.గతంలో గడ్డపారకు, మంచినీటికి,గంపకు అదనపు చెల్లింపులు ఉండేవని, ప్రస్తుతం అవన్నీ రద్దు చేయడం వల్ల కూలీలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పనులు జరిగే ప్రదేశాల్లో వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికీ వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు లింగారెడ్డి,ఎల్లస్వామి, శ్రీనివాసులు,బిచ్చన్న తదితరులు పాల్గొన్నారు.

