NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హనుమద్ జయంతి మహోత్సవములలో చివరిరోజు  పూర్ణాహుతి కార్యక్రమం

1 min read

శ్రీ స్వామి వారికి పంచామృతాభిషేకం,ఆలయ పుష్కరిణిలో చక్రస్నానం

అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన

దేవస్థానమునకు వివిధ సేవల రూపేణా రూ.202586/-లు  సమకూరినది

దేవస్థానమునకు విచ్చేసిన సుమారు 2186 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: హనుమద్ జయంతి మహోత్సవములలో చివరిరోజు సందర్భముగా ఉదయం పూర్ణాహుతి కార్యక్రమం జరిగినది. అనంతరం శ్రీ స్వామి వారికి పంచామృతాభిషేకం మరియు శ్రీ స్వామి వారి ఆలయ పుష్కరిణిలో చక్రస్నానం జరిగినదని ఆలయ అసిస్టెంట్ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెలియజేసినారు. శనివారం మద్యాహ్నం గం03.00 ల వరకు శ్రీ స్వామి వారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణా రూ.202586/-లు  సమకూరినది. ఈ రోజు శ్రీ స్వామి వారి దేవస్థానమునకు విచ్చేసిన సుమారు 2186 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగినది.ఈ రోజు సాయ్యంత్రo గం.6.00  ల నుండి శ్రీ స్వామి వారికి ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవం జరుగును.  భక్తులు ఈ కార్యక్రమం నందు పాల్గొని తీర్ధప్రసాదములు స్వీకరించవలసినదిగా ఆలయ అసిస్టెంట్ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెలియజేసినారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *