NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అటవీ శాఖలో రీజెనరేషన్ స్కీమ్ కింద 3 వాహనాలు మంజూరు

1 min read

సీఎం చంద్రబాబు కి, ఉన్నతాధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు

జిల్లా అటవీ శాఖాధికారి పి.వి. సందీప్ రెడ్డి

వన్యప్రాణి సంరక్షణ బలోపేతం,  సమర్థవంతమైన పట్రోలింగ్ నిర్వహణకు ఎంతో దోహదపడనున్నయి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: అటవీ శాఖలో రీజెనరేషన్ స్కీమ్ కింద 3 వాహనాలు మంజూరు చేశారని జిల్లా అటవీ శాఖాధికారి పి.వి.సందీప్ రెడ్డి తెపారు.వాహనాలను ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి (అటవి దళాధిపతి) ఆంధ్ర ప్రదేశ్, వారు మరియు ముఖ్య అటవీ సంరక్షణాధికారి, రాజమహేంద్రవరం వారి కార్యాలయంలో జెండా ఊపి నూతన వాహనాలను ప్రారంభించారన్నారు.   ఏలూరు అటవీ శాఖ పరిధిలో మూడు (03) కొత్త వాహనాలను సంబంధిత రేంజ్లకు కేటాయించడం జరిగిందని,  కుకునూరు రేంజ్,అమరావరం రేంజ్ మరియు టాస్క్ ఫోర్స్, ఏలూరు కు ఈ వాహనాలు అందజేయబడ్డాయన్నారు.  ఈ వాహనాలు అటవీ మరియు వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమాలను బలోపేతం చేయడంతో పాటు, సమర్థవంతమైన పట్రోలింగ్ నిర్వహణకు ఎంతో దోహదపడనున్నాయని,ఫీల్డ్ స్థాయి సిబ్బంది పనితీరును మెరుగుపరచడమే కాకుండా, వారికి ఉత్తేజాన్ని కలిగించనున్నాయన్నారు. గత సంవత్సర కాలంలో సుమారు 10 వాహనాలు సిఏ ఎమ్ పిఏ పథకం కింద (కేంద్ర ప్రభుత్వ పథకం) వివిధ రేంజ్లు మరియు విభాగాలకు కేటాయించబడ్డాయని,వాటి ద్వారా అటవీ సంరక్షణ, వన్యప్రాణి పరిరక్షణ మరియు పట్రోలింగ్ కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా కొనసాగుతున్నాయన్నారు.  ఈరోజు కేటాయించిన మూడు వాహనాలతో కలిపి, మొత్తం 13 వాహనాలు ఇప్పటివరకు డివిజన్కు అందుబాటులోకి వచ్చినట్లు ఆయన తెలియజేసారు. ఈ వాహనాల సమకూర్పు ద్వారా అటవీ మరియు వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమాలు మరింత బలోపేతం అవుతాయని అటవీ శాఖ భావిస్తోందన్నారు. ముఖ్యమంత్రి మరియు  ఉప ముఖ్యమంత్రి కి,అలాగే ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి (హెచ్.ఓ.ఎఫ్.ఎఫ్.) మరియు ముఖ్య అటవీ సంరక్షణాధికారి, రాజమహేంద్రవరం వారికి అటవీ శాఖ,ఏలూరు తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని సందీప్ రెడ్డి తెలియజేసారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *