NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే కోట్ల

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా  శనివారం ప్యాపిలి పట్టణంలో  ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ అనే థీమ్ తో నిర్వహించే  కార్యక్రమంలో  డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని, భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్‌ను అందించాలంటే ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.అలాగే ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా చెత్తను వేర్వేరుగా వర్గీకరించి ప్రత్యేక డస్ట్‌బిన్‌లలో వేయడం చాలా అవసరమని తెలిపారు. ప్రభుత్వం సూచించిన విధంగా

ఆకుపచ్చ బిన్‌లో తడి చెత్త,నీలం బిన్‌లో పొడి చెత్త, ఎరుపు బిన్‌లో శానిటరీ వ్యర్థాలు, నలుపు లేదా నీలం బిన్‌లో ప్రమాదకర మరియు ఈ-వ్యర్థాలను వేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు.ప్రతి ఇంటి నుండి చెత్తను సక్రమంగా వేరు చేసి ఇవ్వడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రతి పౌరుడి పాత్ర ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే  పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరావు యాదవ్, ఎంపీడీవో శ్రీనివాసరావు,ఇఓ శివ కుమార్ గౌడ్, డోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా రేణుక, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా నారాయణమూర్తి, తెదేపా మండల ఇంచార్జి  ఎద్దుల దొడ్డి ప్రభాకర్ రెడ్డి, మండల కన్వీనర్ సుదర్శన్, పట్టణ కన్వీనర్ కొంగనపల్లి మధు, బత్తుల రమేష్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, తేదేపా జనరల్ సెక్రెటరీ నడిగడ్డ నాగేంద్ర, తేదేపా ఎస్టీ బీసీ సెల్ అధికార ప్రతినిధి మదు కుమార్, ముస్లిం మైనారిటీ నాయకులు ఖాజా ఫీర్, మాజీ ఎంపిటిసి గోల్ల రామ్మోహన్ యాదవ్,నాల్లమేకాల పల్లె సత్యం, తేదేపా క్లస్టర్ ఇన్చార్జి పెద్ద పూజర్ల ప్రసాద్ రెడ్డి, తేదేపా నాయకులు గుండాల చంద్రశేఖర్, పోతుదోడ్డి కదిరప్ప, నారాయణ, పిక్కిలి బొలికొండ, కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *