NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేశసేవకు ప్రేరేపించేదే నిజమైన ధర్మం

1 min read

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తి.తి.దే.

వేముగోడులో ఘనంగా ముగిసిన తి.తి.దే. ధార్మిక కార్యక్రమాలు.

కర్నూలు, న్యూస్​ నేడు:  ధర్మమంటే కేవలం పూజలు, వ్రతాలు మాత్రమే కాదని, మన దేశం, సమాజం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలనే బాధ్యతను కలిగించేదే నిజమైన ధర్మమని, దేశం కోసం త్యాగ భావాన్ని, ప్రజల కోసం జీవించడం నేర్పేదే సనాతన ధర్మమని, మాతృభూమిని గౌరవించని భక్తి అసంపూర్ణమని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో  గోనెగండ్ల మండలం, వేముగోడు గ్రామంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు గత ఐదు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్బంగా ఆలయ అర్చకులు మల్లిఖార్జునయ్య గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఇస్కాన్ ధర్మ ప్రచారకులు నిత్యతృప్తదాస్ స్వామి చేసిన ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలి నిర్వహించిన భజన కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో భజన మండలి అధ్యక్షులు యాగంటి ఈశ్వరరెడ్డి, హార్మోనిష్ఠు జి. ఈరన్న, డక్కీ మాష్టారు ఎ. వీరన్న, తబలిష్ఠు కె. అర్జున్,  వై.రాజారెడ్డి, బి. చిన్నయ్య,  రంగన్న, ఎ. వినోద్,  మద్దిలేటి, సి. ఉరుకుందు,  యం. లక్ష్మణ్ణ, జి.రామాంజనేయులు, రాఘవేంద్రతోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *