3,36,250 రూ.లను నొక్కేసిన పొదుపు లీడర్
1 min read
ఫోర్జరీ సంతకాలు,నకిలీ రసీదులు
సంఘాలపై వెలుగు అధికారుల పర్యవేక్షణ కరువు.?
మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: మహిళా పొదుపు సంఘంలో సభ్యులకు తెలియకుండానే 3,36,250 రూ.లను మొదటి లీడర్ నొక్కేసిన సంఘటననంద్యాల జిల్లా మిడుతూరు మండలం నాగలూటి గ్రామంలో జరిగింది.గ్రామంలో షరీఫా మహిళా పొదుపు లక్ష్మి గ్రూపు మొదటి లీడర్ ముర్తుజాబి సంఘ సభ్యులకు తెలియకుండానే 3,36,250 రూ.లు తీసుకున్నారని సంఘ సభ్యులు మొదటి లీడర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.సంఘ సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి మాకు తెలియకుండా బ్రాహ్మణకొట్కూర్ బ్యాంకులో సీసీ లోన్ తీసుకుందని అంతేకాకుండా మేము గతంలో తీసుకున్న లోన్ మరియు స్త్రీ నిధి లోన్ డబ్బులు ప్రతినెలా కడుతున్నాం.ఈ లోన్ డబ్బులు సభ్యులు ప్రతినెలా వేయాల్సి ఉండగా నేను బ్యాంకులో వేస్తానని సభ్యుల వద్ద నుండి డబ్బులు తీసుకొని బ్యాంకులో లీడర్ వేయలేదని సభ్యులు అన్నారు.ప్రతినెలా బ్యాంకులో డబ్బులు కట్టినట్లు నకిలీ రసీదులు సృష్టించారని ఆమెపై తన చర్యలు తీసుకోవాలని సంఘ సభ్యులు మైమున్ భీ, ఆయేషా,ఖాజాభి,శంషాద్, మాలాన్ భీ,ఫాతిమాభి తదితర సభ్యులు అన్నారు. ఈ విషయంపై సభ్యులు గురువారం పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు వారు తెలిపారు.ఈ డబ్బులు నొక్కేసిన వైనం గురించి బ్యాంకుకు వెళ్లి చూడగా విషయం బయటకు వచ్చిందని సభ్యులు అంటున్నారు.పొదుపు సంఘాలను గాడిలో పెట్టాల్సిన వెలుగు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతున్నాయని సభ్యులు ఆరోపిస్తున్నారు.ఇక నుండి అయినా మండలంలో ఉన్న పొదుపు సంఘాలు సక్రమంగా నడిచే విధంగా అంతేకాకుండా పొదుపు సంఘాల్లో అవకతవకలు జరగకుండా వెలుగు సిబ్బంది గాడిలో పెడతారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

