రైతుల సాగు అవసరాల కోసం నీటి విడుదల..
1 min read
మంత్రి నిమ్మల రామానాయుడు,ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా నీటి పంపిణీని సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం డెలివరీ పాయింట్ వద్ద రైతుల ఖరీఫ్ సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నీటిని విడుదల చేశారు.ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యే ప్రాజెక్టు వద్ద ఉన్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో నీటి సరఫరా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఆయకట్టు ప్రాంతంలోని ప్రతి రైతుకు సకాలంలో సాగునీరు అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని తెలిపారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా నీటి పంపిణీని సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీరు అందించడం రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతగా భావిస్తోందన్నారు. ప్రాజెక్టు పురోగతి, డెలివరీ పాయింట్ వద్ద నీటి లభ్యత, నీటి పంపిణీ ప్రణాళిక, ఆయకట్టు రైతులకు అందనున్న ప్రయోజనాలపై మీడియాకు వివరించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, సాగునీటి విషయంలో ఎలాంటి కొరత లేకుండా చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఆర్డీవో రమణ, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.


