NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హెబ్బటం గ్రామంలో ఎస్‌ఐఆర్ కార్యక్రమం పరిశీలన

1 min read

– ప్రతి ఇంటికి వెళ్లి సర్వే పూర్తి చేయాలని సూచన

ప్రతి ఓటును పరిరక్షించడం అందరి బాధ్యత – గ్రామ ప్రజలు పూర్తి సహకారం అందించాలని పిలుపు

హొళగుందన్యూస్ నేడు: హొళగుంద మండలం, హెబ్బటం: ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు హెబ్బటం గ్రామపంచాయతీలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమాన్ని సింగిల్ విండో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పరిశీలించారు.ఈ సందర్భంగా క్లస్టర్ నంబర్–1 పరిధిలోని బూత్ నంబర్లు 55, 56, 57, 58లలో బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు చేపడుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని క్లస్టర్ ఇన్‌చార్జ్ మల్లికార్జున పరిశీలించి పలు సూచనలు చేశారు.ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామంలోని ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ వివరాలను సరిచూసుకుని, అవసరమైన సమాచారం అందిస్తూ బీఎల్‌వోలు, బీఎల్‌ఏలకు పూర్తి సహకారం అందించాలని కోరారు.ప్రతి ఓటును పరిరక్షించడం మనందరి బాధ్యత అని, అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని, అవసరమైతే సవరణలు, కొత్త నమోదు ప్రక్రియలను పూర్తి చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author