దళిత మేధావి డాక్టర్ సుధాకర్ జ్ఞాపకార్థం కొవ్వొత్తులతో నివాళులు
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత మేధావి డాక్టర్ సుధాకర్ జ్ఞాపకార్థం మాజీ కేంద్ర మంత్రి, డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డికొవ్వొత్తులతో నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డాక్టర్ సుధాకర్ మరణం కేవలం ఒక వ్యక్తి మరణం కాదని, అది అహంకార పాలన బలిగొన్న ఒక దళిత మేధావి ఆవేదనకు ప్రతీక అని అన్నారు. కరోనా సమయంలో ప్రజల ఆరోగ్యం కోసం పోరాడిన ఒక వైద్యుడు “మాస్కులు ఇవ్వండి.. రక్షణ పరికరాలు అందించండి” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే ఆయనను అవమానించి, మానసిక రోగిగా ముద్ర వేసి, పోలీసులతో నడిరోడ్డుపై చేతులు కట్టించి అమానుషంగా ప్రవర్తించడం రాష్ట్ర ప్రజలను కలచివేసిందన్నారు.ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వం, నిజం మాట్లాడిన వారిని అణగదొక్కడమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. ఒక ఉన్నత విద్యావంతుడైన దళిత అధికారిపై జరిగిన ఈ దౌర్జన్యం రాష్ట్ర చరిత్రలో ఒక నల్లటి అధ్యాయంగా మిగిలిపోయిందన్నారు. అధికార మదంతో ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కిన గత పాలకులకు ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.దళితులు, బడుగు బలహీన వర్గాలు ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, అవమానించడం గత ప్రభుత్వానికి అలవాటైపోయిందని మండిపడ్డారు. డాక్టర్ సుధాకర్ ఘటనపై దేశవ్యాప్తంగా మేధావులు, మానవ హక్కుల సంఘాలు స్పందించినా అప్పటి ప్రభుత్వం కనీస మానవత్వం కూడా చూపలేదని విమర్శించారు.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా గత పాలకులు వ్యవహరించారని, దళిత సమాజం గౌరవాన్ని దెబ్బతీసే చర్యలు చేపట్టారని అన్నారు. అలాంటి అరాచక పాలనను ప్రజలు తిరస్కరించి ప్రజాస్వామ్యానికి మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు.డాక్టర్ సుధాకర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. సమాజంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరావు యాదవ్, డోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా రేణుక, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా నారాయణమూర్తి, తెదేపా మండల ఇంచార్జి ఎద్దుల దొడ్డి ప్రభాకర్ రెడ్డి, తేదేపా నాయకులు చండ్రపల్లి లక్ష్మి నారాయణ యాదవ్,మండల కన్వీనర్ సుదర్శన్, పట్టణ కన్వీనర్ కొంగనపల్లి మధు, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, తేదేపా జనరల్ సెక్రెటరీ నడిగడ్డ నాగేంద్ర, కమతం భాస్కర్ రెడ్డి ,తేదేపా ఎస్టీ బీసీ సెల్ అధికార ప్రతినిధి మదు కుమార్, ముస్లిం మైనారిటీ నాయకులు ఖాజా ఫీర్, ఎస్ కే వలి,మాజీ ఎంపిటిసి గోల్ల రామ్మోహన్ యాదవ్, తేదేపా క్లస్టర్ ఇన్చార్జి పెద్ద పూజర్ల ప్రసాద్ రెడ్డి, తేదేపా నాయకులు గుండాల చంద్రశేఖర్, కడితం ప్రతాప్ రెడ్డి, రాజా రవి,పోతుదోడ్డి కదిరప్ప, నారాయణ, పిక్కిలి బొలికొండ,సుంకన్న, కూటమి నాయకులు దళిత సంఘాల ప్రతినిధులు, టీడీపీ మరియు కూటమి కార్యకర్తలు, పాల్గొని కొవ్వొత్తులతో నివాళులర్పించారు.


