NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతి గురువారం ఉచిత వైద్య శిబిరం

1 min read

బిపి, షుగర్‌ వంటి వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించీ, అవసరమైన వారికి మందులను పంపిణీ

పార్టీలకతీతంగాఎంతో ఆదర్శవంతంగా కొనసాగుతోంది

ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో స్ఫూర్తివంతమైన సేవలను ఆదర్శవంతంగా ముందుకు తీసుకెళ్ళేందుకు ప్రత్యేక దృష్టిసారించినట్లు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. ఇదేతరుణంలో దాతలు స్పందిస్తోన్న తీరు ఎంతో అమోఘమని ఆయన కొనియాడారు. అవసరార్థులకు సమయానికి వివిధ రూపాల్లో అందించే సేవలు ఎంతో నిరుపమానమైనవని భావించే ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆ దిశగా వాటిని ఎంతో ఆదర్శవంతంగా ముందుకు తీసుకెళ్తూ వస్తున్నారు. ఇదేక్రమంలో ప్రతి గురువారం వైద్య శిబిరం నిర్వహించాలనే ఉన్నతాలోచన చేశారు. అనుకున్నదే తడవుగా దాన్ని ఆచరణలోనూ పెట్టారు. దీంతో ఏలూరు పవర్‌ పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ప్రతి గురువారం ఉచిత వైద్య శిబిరం ఎంతో ఆదర్శవంతంగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఈ గురువారం కూడా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ద్వారా అనేక మంది అవసరార్థులు వైద్య సేవలు పొందారు. శిబిరానికి విచ్చేసిన వారికి వైద్యులు, వైద్య సిబ్బంది బిపి, షుగర్‌ వంటి వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించీ, అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్య శిబిరం కొనసాగుతోన్న తీరును స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే బడేటి చంటి పలువురికి ఉచితంగా మందులను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను చేయాలనుకున్న మంచికి దాతల నుండి అందుతోన్న సహకారం కూడా ఎంతో గొప్పదన్నారు. ఈ గురువారం వైద్య శిబిరానికి విచ్చేసే రోగులకు కైకలూరుకు చెందిన కృష్ణ మెడికల్స్‌ అధినేత రాధాకృష్ణ మూర్తి సాధారణ వ్యాధులకు సంబంధించి ఉచితంగా మందులను అందజేశారన్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడిన ఎమ్మెల్యే చంటి రానున్న రోజుల్లో నెలకి ఒకసారి ఒక్కో స్పెషలిస్టు వైద్యునితో శిబిరంలో ఉచిత వైద్య సేవలు అందించేలా పార్టీలకతీతంగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ సేవలను అవసరార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర మాలల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దాసరి ఆంజనేయులు, EUDA చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, జిల్లా మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్య వరప్రసాదరావు (కంప్యూటర్ ప్రసాద్) ,టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ అధ్యక్షులు జుంజు మోసెస్, బిఎస్ఎన్ఎల్ అడ్వైజరి బోర్డు డైరెక్టర్ లంకపల్లి మాణిక్యాలరావు, నగర SC సెల్ అధ్యక్షులు పెద్దాడ వెంకటరమణ, నాయకులు మారం అను, జాల బాలాజీ, చోడే బాలు, రేవుల గడ్డ లాలా లజపతిరాయ్, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *