NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

షిరిడి సాయి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో నిత్యావసర సరుకులు పంపిణీ

1 min read

కర్నూలు, న్యూస్​నేడు:   కర్నూలు నగరంలోని నందికొట్కూరు రోడ్‌లో ఉన్న షిరిడి సాయి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఇండియన్ బ్యాంకు కర్నూలు ప్రధాన శాఖ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో బ్యాంకు చీఫ్ మేనేజర్  అశోక్ కుమార్  తమ సంస్థ తరపున 11 ఫ్యాన్లు, 50 కేజీల బియ్యం, కంది పప్పు మరియు 2 ప్యాకెట్ల గోధుమ పిండి అందజేశారు.ఈ ఆశ్రమంలో నివసిస్తున్న 50 మంది వృద్ధులకు నిర్వాహకులు అందిస్తున్న సేవలను ఆయన అభినందిస్తూ, సమాజంలో నిరాధారణకు గురైన ఇలాంటి వారికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందిస్తే ఆశ్రమ నిర్వాహకులు మరింత సేవ చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ శ్రీమతి ఎస్. చందన  యూనియన్ నాయకులు శ్రీ ఇ. నాగరాజు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *