NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థుల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి

1 min read

ప్రైవేట్ విద్యాసంస్థల అక్రమాలపై కలెక్టర్‌కు బిసీవై పార్టీ వినతిపత్రం

RTE చట్టం అమలు, 25% ఉచిత సీట్ల ప్రకటనకు డిమాండ్

హోళగుంద న్యూస్ నేడు: రాష్ట్రంలోని విద్యార్థుల హక్కుల పరిరక్షణ, విద్యా నాణ్యత మెరుగుదల, ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం మరియు అనుమతి లేని ప్రైవేట్ విద్యాసంస్థల నియంత్రణపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత చైతన్య యువజన పార్టీ (BCYP) నాయకులు కర్నూలు జిల్లా కలెక్టర్ డా. A. సిరినీ వినతిపత్రాన్ని అందజేశారు.బిసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఎల్లార్తి అర్జున్ వాల్మీకి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కలెక్టర్‌ను కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో కొనసాగుతున్న అనేక సమస్యలను వివరించారు.ప్రస్తుతం అనేక ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా అమలు చేయకుండా అధిక ఫీజులు వసూలు చేయడం, విద్యార్థుల హక్కులను నిర్లక్ష్యం చేయడం, ఉపాధ్యాయులకు సరైన వేతనాలు మరియు సౌకర్యాలు కల్పించకుండా వేధింపులకు గురిచేయడం వంటి సమస్యలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా బిసీవై పార్టీ తరఫున కలెక్టర్‌కు ఆరు ముఖ్య డిమాండ్లతో కూడిన మెమోరాండాన్ని అందజేశారు.ప్రధాన డిమాండ్లు:వచ్చే విద్యా సంవత్సరం నుంచి RTE చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి.ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 25 శాతం ఉచిత సీట్లు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కేటాయించి వివరాలను బహిరంగంగా ప్రకటించాలి.ప్రతి ప్రైవేట్ స్కూల్ ముందు ఫీజుల వివరాలతో నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలి.టీచర్లు – విద్యార్థుల నిష్పత్తికి సంబంధించిన ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాలి.అనుమతి లేకుండా నడుస్తున్న విద్యాసంస్థలపై తనిఖీలు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సరైన జీతాలు, ఉద్యోగ భద్రత, అవసరమైన సౌకర్యాలు కల్పించని సంస్థలపై ప్రత్యేక నిఘా పెట్టాలి.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర PAC మెంబర్ వెంకటేశ్వర్ యాదవ్, రాష్ట్ర ఈసీ మెంబర్ కంది వరుణ్ కుమార్ యాదవ్, పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొబ్బే పక్కీరప్ప, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగార్జునతో పాటు పలువురు బిసీవై పార్టీ నాయకులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *