ప్రపంచ తెలుగు మహాసభల పోస్టర్ విడుదల
1 min read
విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు,గుడిసె ఆది కిష్టమ్మ, సాంస్కృతి విభాగం అధ్యక్షుడు పి హనుమంతరావు చౌదరి, తెలుగు మహాసభల ప్రదాన కార్యదర్శి నాగేశ్వ రయ్య,
కర్నూలు, న్యూస్ నేడు: జూన్ 6,7 తేదీలలో చైతన్య సారస్వత పరిషత్ సౌజన్యంతో ప్రముఖ అంతర్జాతీయ తెలుగు కళా సాంస్కృతిక సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో రాజమండ్రి లో జరుగు తున్న 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు ఆహ్వానిస్తూ గోడపత్రికను టిడిపి కర్నూల్ జిల్లా అధ్యక్షురాలుగుడి సె,కృష్ణమ్మ గారి చే తెలుగుదేశంపార్టీ ఆఫీస్ లో అవిష్కరింపచేశారు కిష్టమ్మ మాట్లాడుతూ తెలుగు భాష కోసం ప్రపంచ దేశాలు ఇష్టపడతాయని తెలుగులోనే మాట్లాడండి తెలుగుదేశం పార్టీలోనే తెలుగు ఉంది తెలుగు భాష కోసం అందరం పాటుపడదాం,ఈ సభలను జయప్రదం చేయాలని ఒక జాతి ఔన్నత్యాన్ని మనుగడను కాపాడేది భాష సంస్కృతులే నని కృష్ణమ్మగారు పిలుపు నిచ్చారు.ఈ ఆవిష్కరణలో పాల్గొన్న టిడిపి కల్చరల్ విభాగం అధ్యక్షులు శ్రీ హనుమంతరావు చౌదరి మాట్లాడుతూ తెలుగు భాష మనుగడకు ఇలాంటి సభలు పెద్దఎత్తున జరపడం అభినందనీయం అని నందమూరి తారక రామారావు తెలుగు భాష అంటూ ఉమ్మడితెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ప్రజల కోసం నిరంతరం పోరాటం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలుగు భాషని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలని అన్నారు అనిఅన్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమం లో ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్. ధరూరి జేమ్స్,… బీహెచ్ఈఎల్ జిల్లా అధ్యక్షుడు సత్రం రామకృష్ణ, సోషల్ మీడియా ఇన్ఛార్జి మందు అఖిల్, భాష మొదలగు నాయకులు. పాల్గొని ఈ ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.

