యువత పొగాకు కంపెనీల మాయాజాలంలో పడొద్దు…
1 min read
కర్నూలు , న్యూస్ నేడు: అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, కర్నూల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ…. దేశంలో ముఖ్యంగా యువత పొకాకు కంపెనీలు చేసే మాయాజాలంలో పడవద్దని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ యువతకు పిలుపునిచ్చారు. మంగళవారం స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నందు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31 నీ పురస్కరించుకొని కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పొగాకు వాడడం అంటే కేవలం సిగరెట్ తాగడం మాత్రమే కాదని గుట్కా పాన్ మసాలా ఈ సిగరెట్ హుక్కా, నషమ్ వంటివి తీసుకున్న కూడా కాన్సర్ బారిన పడతారని తెలిపారు. కాన్సర్ తో పాటు గుండెపోటు, పక్షపాతం వంధ్యత్వం లాంటి సమస్యలు కూడా వస్తాయని హెచ్చరించారు. స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ సి ఎస్ కే ప్రకాష్ మాట్లాడుతూ క్యాన్సర్ అంటే కేవలం ఊపిరితిత్తుల క్యాన్సర్ మాత్రమే అని చాలా మంది ప్రజలు అనుకుంటున్నారని ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, అన్నవాహిక, పెద్దప్రేగు, లివర్ క్యాన్సర్ లాంటివి అనేక క్యాన్సర్ లు ఉన్నాయని ఇవన్నీ కూడా పొగాకు ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా సంభవిస్థాయిని యువత వీటి గురించి కచ్చితంగా తెలుసుకోవాలన్నారు. వైస్ ప్రిన్సిపల్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ సింధియా శుభప్రద మాట్లాడుతూ దేశానికి యువత ప్రధానమని అదే యువత పొగాకు ఉత్పత్తులకు బానిస కావడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. పొగాకు మత్తుకు బానిస అయిన వారికి ప్రత్యేక చికిత్స విధానాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అందులో డి అడిక్షన్ సెంటర్ లు ముఖ్యమని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమానికి నోడల్ ఆఫీసర్ గా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవి నాయక్, అతిథులుగా డిప్యూటీ సూపర్డెంట్ డాక్టర్ లక్ష్మి, అసోసియేట్ ప్రొఫెసర్ రూఫస్, అసిస్టెంట్లు డా. నాగరాజు, డా చంద్రశేఖర్, డా. సుమన్, లెక్చరర్ సురేష్,ఎన్టిసిపి సైకాలజిస్ట్లు చంద్రశేఖర్, సోమశేఖర్, ఎస్సార్ బ్రయన్, పీజీ వైద్యులు డా.కార్తీక్, డా. సురేష్, డాక్టర్ శ్రీలక్ష్మి హెల్త్ సూపర్వైజర్లు సాయిరాం మాధవరాజు తదితరులు పాల్గొన్నారు.

