మద్దిలేటి మరణం పార్టీకి తీరని లోటు
1 min read
డిసిసి అధ్యక్షులు అడ్వకెట్ క్రాంతి నాయుడు బోయ
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ మాజీ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, వాల్మీకి సంఘం సీనియర్ నాయకులు బోయ మద్దిలేటి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు న్యాయవాది క్రాంతి నాయుడు బోయ తెలియజేశారు. మద్దిలేటి ఈరోజు గుండె నొప్పితో మరణించడం చాలా బాధాకరమయిన విషయమని బీసీ సెల్ అధ్యక్షులుగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేశారని మద్దిలేటి సేవలను కొనియాడారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని క్రాంతి నాయుడు తెలియజేశారు.

