NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సి ప్లైన్ ట్రైల్ రన్ మాత్రమే చూశారు ప్రారంభోత్సవం కాదు. తెలుసుకొని మాట్లాడండి

1 min read

ఏస్ వి.మోహన్ రెడ్డి . గుడిసె ఆది కృష్ణమ్మ సూచన.

కర్నూలు, న్యూస్​ నేడు: వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు ఎస్పీ మోహన్ రెడ్డి  ఇటీవల సీప్లైన్ గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై కొన్ని అనుచితవ్యాఖ్యలు చేశారు . సీప్లైన్ను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు  కేవలం ట్రైలు మాత్రమే చూశారు తప్ప ప్రారంభోత్సవం చేయలేదని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు ఆది కృష్ణమ్మ తెలిపారు ఈ విషయమై వారు స్పందిస్తూ సీప్లైన్ భూభాగంపై కాక నీటి ప్రాంతంలో  ఉపయోగించుకునే దానికి అవకాశం ఉంటుందని అలాగే దూర భారాన్ని కూడా తగ్గించే వీలు ఉంటుందని తెలియజేశారు 2017 లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు  ఈ కార్యక్రమానికి శ్రీకారం దురదృష్టవశాత్తు రాష్ట్రంలో వైఎస్సార్ పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్ మోహన్ రెడ్డి దీనిని విస్మరించారని అయితే 2024లో తిరిగి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు విజయవాడ నుండి శ్రీశైలం కు ఈ సీప్లే న్ ట్రైలు చూశారని ఇది సక్సెస్ అయినందున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు దీని ద్వారా ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తూనారని ఇది గమనించని ఎస్వీ మోహన్ రెడ్డి  దీనిపై విమర్శలు చేయడం సమంజసం కాదని అన్నారు. ఇటీవల వైయస్ జగన్మోహన్ రెడ్డి హత్యా రాజకీయాలను గురించి మాట్లాడుతూ తన తాత రాజా రెడ్డిని హత్య చేసిన అంశం గురించి ప్రస్తావించగా రాజారెడ్డి  చరిత్ర ఏమిటో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసుకునేలా చేసినారని వారి బాధితులు రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నారని ప్రజలు తెలుసుకునేలా చేసినందుకు జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసిన కృష్ణమ్మ, ఎస్వీ కుటుంబం అంటే జిల్లాలో మంచి పేరు ఉందని అయితే ఎస్వీ మోహన్ రెడ్డి  తన కుటుంబ గౌరవాన్ని మంటగలిపేలా అనవసరమైన విమర్శలకు దిగి కుటుంబ గౌరవాన్ని పోగొట్టుకున్నారని ఎంతో హుందాగా వ్యవహరించాల్సిన మీరు ఇలా జగన్ కోసం నిజానిజాలు తెలుసుకొని మాట్లాడవలసిన మీరు తప్పుడు ఆలోచనలతో ముఖ్యమంత్రి  పై విమర్శలు చేయడం సమంజసం కాదని మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం చేసే మంచి పనులను సమర్ధించి తప్రజలకు అవసరమైనటువంటి సమస్యల పైన సూచనలు ఇస్తే బాగుంటుందని ఈ సందర్భంలో తెలియజేశారు.

About Author