NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కార్మిక హక్కుల కోసం ఆవిర్భవించిందే సిఐటియు ఎర్రజెండా

1 min read

కార్మిక హక్కులు కాల రాసే నాలుగు లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలి

అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి

కనీస వేతన చట్టం అమలు చేయాలి:-56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిఐటియు డిమాండ్

కర్నూలు, న్యూస్​ నేడు:  కార్మిక హక్కుల కోసం సామాజిక న్యాయం కోసం సమానత్వం కోసం పుట్టిందే సిఐటియు ఎర్రజెండా అని సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు బి.మాణిక్యం శెట్టి,టి.శివరాం,మండల కో కన్వీనర్ బి.నాగమద్దయ్య,మండల నాయకులు పి.రామాంజనేయులు పట్టణ ఉపాధ్యక్షులు నక్కి శ్రీకాంత్ అన్నారు.ముందుగా సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక కొండపేటలోని డోన్ మోటార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు కార్యాలయం దగ్గర సిఐటియు జెండాను సీనియర్ నాయకులు పి.రామాంజనేయులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాల భారత కార్మిక వర్గాన్ని ఐక్యం చేసే లక్ష్యంతో…ఐక్యత – పోరాటం నినాదంతో 1970 మే 30వ తేదీన సిఐటియు (సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్) ఆవిర్భవించిందన్నారు.నాటి నుండి నేటి వరకు అన్ని రంగాలకు సిఐటియు విస్తరించిందని కార్మిక హక్కుల కోసం పోరాడుతూనే ఉద్యోగ,ఉపాధ్యాయ,రైతాంగ,ప్రజా సమస్యలకు,సామాజిక పోరాటాలకు మద్దతు ఇస్తూ రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూ అనేక విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతున్నది భారత దేశంలోనే అతి పెద్ద కార్మిక సంఘం సిఐటియు సంఘం అన్నారు.అయితే ప్రస్తుతం దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వంలోని మతతత్వ బిజెపి కూటమి ప్రభుత్వం కార్మికులు పోరాడి ప్రాణ త్యాగాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్మిక హక్కులను కాలరాస్తున్నదని అభివృద్ధి పేరుతో పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధానాలతో వారికి అనుకూలమైన నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చి కార్మికులను వారికి నయా బానిసలుగా మార్చే విధానాలు అవలంబిస్తున్నదని దానికి రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా వంత పాడటం అత్యంత దుర్మార్గమని ఇది పాలకులు ఎన్నికలకు ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను విస్మరించి వారికి ద్రోహం చేయడమేనని వారు అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలని కార్మికులు లేనిదే అభివృద్ధి లేదన్న నిజాన్ని గ్రహించాలని వారి హక్కులను కాపాడాలని నాలుగు లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని,అసంఘటితరంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని,కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని,కనీస వేతన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.లేని యెడల ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను,హక్కులను కాపాడుకునేందుకు తిరిగి పోరాటాలు చేయవలసిన దుస్థితి దాపురించడం నేటి పాలకుల నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఏది ఏమైనా యావత్ కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు జి.రామమూర్తి,మోటార్ వర్కర్స్ యూనియన్ కమిటీ సభ్యులు ఆదినారాయణ రెడ్డి,కృష్ణారెడ్డి,లారీ డ్రైవర్లు శ్రీనివాసులు,బుగ్గరాముడు,రాము,ఆది,లక్ష్మన్న,ప్రైవేట్ స్కూల్ బస్ వర్కర్స్ యూనియన్ నాయకులు గోపాల్,ఆటో యూనియన్ నాయకులు పెద్దయ్య,వెంకటేష్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కుల్లాయప్ప,సిఐటియు ప్యాపిలి మండల కార్యదర్శి చిన్న రెహమాన్,ఐద్వా నాయకురాలు షమీం బేగం తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *