NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హొలగుందలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

1 min read

– బంధువులు, కుటుంబ సభ్యులు సంప్రదించాలని పోలీసుల విజ్ఞప్తి

హోళగుంద న్యూస్ నేడు: హొలగుంద మండల ప్రజలకు హొలగుంద పోలీసులు కీలక విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రంలోని సాయిబన్న దర్గా వద్ద గత కొన్ని రోజులుగా యాచిస్తూ జీవనం సాగిస్తున్న ఒక గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో మూడు రోజుల క్రితం అతడిని హొలగుంద ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స నిమిత్తం చేర్పించారు.ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఈరోజు 108 అంబులెన్స్ ద్వారా ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో ఆ వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని, అతడిని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే లేదా అతనికి సంబంధించిన సమాచారం తెలిసిన వారు వెంటనే హొలగుంద పోలీసులను సంప్రదించాలని హొలగుంద ఎస్సై విజ్ఞప్తి చేశారు.సంప్రదించవలసిన ఫోన్ నంబర్: హొలగుంద ఎస్సై – 9121101161మృతుడి కుటుంబ సభ్యులు లేదా బంధువులు ఈ సమాచారాన్ని గమనించి పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరారు.

About Author