NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పంచాయితీ కార్యదర్శులకు పదోన్నతి

1 min read

49 బన్నూరు పిఎస్ వినయ్ చంద్ర తూడిచెర్లకు బదిలీ..

మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతులు కల్పిస్తూ కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ అడ్డాడ సిరి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారు… నంద్యాల జిల్లా మిడుతూరు మండలం 49 బన్నూరు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న వేల్పుల వినయ్ చంద్ర గ్రేడ్-5 నుండి గ్రేడ్-4 గా పదోన్నతి పొందారు.వినయ్ చంద్ర ఇక్కడ నుండి జూపాడుబంగ్లా మండలం తూడిచెర్ల గ్రామానికి బదిలీ చేశారు.వినయ్ చంద్ర ఈరోజు (బుధవారం)విధుల నుండి రిలీవ్ అయి అక్కడ బాధ్యతలు చేపట్టనున్నారు. వినయ్ చంద్ర చింతలపల్లిలో పనిచేస్తూ 15:72025 న 49 బన్నూరు గ్రామానికి బదిలీపై వచ్చారు.అదేవిధంగా నందికొట్కూరు మండలం దామగట్ల పిఎస్ జి మల్లికార్జున కల్లూరు మండలం కొంగనపాడు గ్రామానికి బదిలీ చేశారు.కోళ్ల బావాపురం పిఎస్ వి.శివన్న బేతంచెర్ల మండలం ముద్దవరం గ్రామానికి బదిలీ చేశారు.పగిడ్యాల మండలం సంకిరేణిపల్లె పిఎస్ జి గురు తరుణ్ కొత్తపల్లి మండలం గోకవరం గ్రామానికి బదిలీ చేశారు.వీరి స్థానాల్లో ఎవరినీ నియమించలేదు.ఈ గ్రామాలకు పంచాయతీ కార్యదర్శులను ఇన్చార్జిలుగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *