NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్టీఆర్ యూనివర్సిటీ వార్షిక స్నాతకోత్సవం

1 min read

గోల్డ్ మెడల్స్ తో  మెరిసిన పీజీ, యూజీ వైద్యులు

కర్నూలు, న్యూస్​ నేడు:  ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 29, 30వ వార్షిక స్నాతకోత్సవంలో కర్నూల్ మెడికల్ కాలేజీకి చెందిన  పీజీ,యూజీ వైద్యులు గోల్డ్ మెడల్స్ తో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచడం జరిగింది.  ఈ వార్షికోత్సవాలు మంగళవారం నాడు విజయవాడ నందలి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ మరియు యూనివర్సిటీ చాన్సలర్ డాక్టర్ అబ్దుల్ నజీర్  ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది.  ఈ స్నాతకోత్సవంలో  డా. జూకూరి సంజీవ్ కుమార్ రాష్ట్రస్థాయిలో బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ ఇన్ న్యూరో సర్జరీ  కి గాను ప్రొఫెసర్ ఎంఆర్సి నాయుడు గోల్డ్ మెడల్ అవార్డు, డాక్టర్ సాయి శంకర్ వినోద్ కు డిఎం కార్డియాలజీలో డా.శేషగిరిరావు మెమోరియల్ గోల్డ్ మెడల్ అవార్డు, డాక్టర్ బిలాల్ మొహిద్దిన్ షేక్ కు గ్యాస్ట్రోఎంటరాలజీలో పి గోపాలకృష్ణ గోల్డ్ మెడల్ అవార్డు, డా. నజ్మా కు బెస్ట్ ఉమెన్స్ స్టూడెంట్, హైయెస్ట్ మార్క్స్ ఇన్ ఎం ఎస్ ఈ ఎన్ టి  కు గాను డాక్టర్ వెంకట చంద్ర చార్యులు మెమోరియల్ గోల్డ్ మెడల్ అవార్డు,డా.తిలక్ మెమోరియల్ గోల్డ్ మెడల్, ఏవో సి అవార్డ్,ఈ ఎఫ్ డేస్మాండ్ అవార్డు, డా సాయి హరికృష్ణకు ఎండి జనరల్ మెడిసిన్ లో బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ గాను శ్రీపాద లక్ష్మీనారాయణ మూర్తి మెమోరియల్ గోల్డ్ మెడల్ అవార్డు, డాక్టర్ బి పురుషోత్తం రావ్ గోల్డ్ మెడ అవార్డు,డా. చంద్ర సింధు ప్రియా ఎమ్మెస్ ఆప్తాలమాలజీ విభాగంలో డాక్టర్ బి కే రాజు సిల్వర్ మెడల్, అదేవిధంగా యూజీ విభాగంలో  కర్నూలు మెడికల్ కాలేజీకి చెందిన వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ హరి చరణ్ కుమార్తె డాక్టర్ పెరిగెల నమ్రత బెస్ట్ స్టేట్  అవుట్ గోయింగ్ ఉమెన్ స్టూడెంట్ (ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనలియర్ ) గాను డాక్టర్ పాలెపు సావిత్రి మెమోరియల్ అవార్డు, బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ ఫైనల్ ఎంబిబిఎస్ స్టేట్ వైడ్ కు గాను డాక్టర్ కేఎన్ రావు గోల్డ్ మెడల్ అవార్డు, మెడిసిన్ సబ్జెక్టులో ఫైనల్ ఎంబిబిఎస్ లో స్టేట్ ఫస్ట్ సాధించినందుకు డాక్టర్ టి. సాంబమూర్తి గోల్డ్ మెడల్ అవార్డు, ఫైనల్ ఎంబిబిఎస్ లో బెస్ట్ ఔట్గోయింగ్ స్టూడెంట్ సాధించినందుకు డాక్టర్ కావూరి హైమావతి చలపతిరావు అవార్డు, యుజీ లో మెడిసిన్ సబ్జెక్టులో స్టేట్ వైడ్ అత్యధిక మార్కులు సాధించినందుకు డాక్టర్ శ్రీనివాసన్ మెమోరియల్ గోల్డ్ మెడల్ అవార్డు, అదేవిధంగా అప్తాలమాలజీ  ప్రొఫెసర్ కేఎల్ఎం రాజకుమార్తే డా. కంచి జయశ్రీ వైష్ణవి వర్మకు ఇఎన్ టి సబ్జెక్ట్ లో  రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించినందుకు డాక్టర్ పిఎన్ రావు డాక్టర్ సత్యమూర్తి అవార్డులను అందుకోవడం జరిగింది. డాక్టర్ నమ్రత ప్రస్తుతం ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఎండి పీడియాట్రిక్స్ చదువుతున్నది. పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ కావాలన్నది తన కోరిక అని తెలిపారు. యూనివర్సిటీ స్నాతకవసరంలో ఉత్తమ కనపర్చి మంచి అవార్డులు సాధించిన విద్యార్థులకు అడిషనల్ డీఎంఈ కర్నూల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ అభినందనలు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *