NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అన్యాక్రాంత దేవాలయ భూములను కాపాడాలి 

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ:  దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని విశ్వహిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షులు వీర రాజు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కు శనివారం వినతి పత్రం సమర్పించారు. పత్తికొండ నియోజకవర్గంలోని వివిధ దేవాలయాల భూముల అన్యాక్రాంతం అయ్యాయని, ఈ విషయమై కర్నూలు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ని కలిసి  అన్ని దేవాలయాలకు సంబంధించి సర్వే నెంబర్లు పూర్తి సమాచారం అసిస్టెంట్ కమిషనర్ కు అందజేశారు. ఈ మేరకు  దేవాలయాల భూములకు సంబంధించి పూర్తి సమాచారం సేకరించి వీలైనంత త్వరగా దేవాలయ భూములను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ కమిషనర్ వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రకండా అధ్యక్షులు వీర రాజుతో పాటు రామలింగయ్య, ఉపేంద్ర నాయుడు,  హిందూ ధార్మిక సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author