NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆలూరులో టీడీపీ నియోజకవర్గ స్థాయి క్యాడర్ సమావేశం ఘనంగా నిర్వహణ

1 min read

పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులకు దిశానిర్దేశం

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు

సమిష్టి కృషితో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేద్దాం – నాయకులు

హోలగుంద న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జోన్-5 కోఆర్డినేటర్ పెళ్లికూరు శ్రీనివాసరెడ్డి, ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ శ్రీమతి వైకుంఠం జ్యోతి, వైకుంఠం శివ ప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి క్యాడర్ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో హొలగుంద మండలానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాల విస్తరణ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే రాబోయే రోజుల్లో నిర్వహించనున్న పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ సందర్భంగా టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్ మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలని అన్నారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ, పార్టీ సిద్ధాంతాలను గ్రామ గ్రామాన చేర్చాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, వారి కృషితోనే పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.నియోజకవర్గంలో పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు నాయకులు, కార్యకర్తలు అందరూ సమిష్టిగా కృషి చేయాలని సమావేశంలో నాయకత్వం పిలుపునిచ్చింది. పార్టీ నిర్ణయాలు, కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి ప్రజల మద్దతు మరింత పెంచుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల, గ్రామ స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *