NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం

1 min read

కార్యక్రమాలపై ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ జిల్లా కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షి 

జూన్ 7తేదీ నుండి 20 వరకు14 రోజులపాటు కార్యక్రమలు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జూన్ 21 వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్, 7వ తేదీ నుండి జూన్, 20వ తేదీ వరకు 14 రోజులపాటు రాష్ట్రంలో నిర్వహించనున్న కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్  రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో శనివారం రాష్ట్ర సచివాలయం నుండి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.  ఈ సందర్భంగా  సీఎస్  సాయిప్రసాద్ మాట్లాడుతూ జూన్, 21 వతేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవము సందర్భంగా  జూన్, 7వ తేదీ నుండి జూన్, 20వ తేదీ వరకు రాష్ట్రంలో జిల్లా స్థాయిలో  ప్రతీ జిల్లాలో చేయవలసిన రోజూవారీ కార్యక్రమాలు, జిల్లాలకు కేటాయించిన థీమ్ లు,  ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రాలలో యోగా కార్యక్రమాల నిర్వహణ, తదితర అంశాలను  సీఎస్ కలెక్టర్లకు తెలియజేసారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జూమ్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

About Author