31,32 డివిజన్లలో వైఎస్ఆర్ సి పి కార్యకర్తలు మజ్జిగ పంపిణీ
1 min read
ప్రారంభించిన ఏలూరు నగర అధ్యక్షులు మామిళ్ళపల్లి జయప్రకాష్ (జెపి)
నగర ప్రధాన కార్యదర్శి షేక్ సత్తార్ ఆధ్వర్యంలో కార్యక్రమం
వైసీపీ కార్యకర్తలు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి షేక్ సత్తార్ ఆధ్వర్యంలో వేసవికాలం సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం అశోక్ నగర్ (అశోక్ స్తంభం వద్ద)31,32 డివిజన్ లలో ఏర్పాటు చేయడమైనది.ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ను ముఖ్యఅతిథి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జీ మామిళ్ళపల్లి జయప్రకాష్ (జె పి)చేతుల మీదుగా డివిజన్ కార్యకర్తలను నడుమ ప్రారంభించారు. జేపీని సత్తార్ కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు,పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న వైఎస్ఆర్ కమిటీ సభ్యులను,నాయకులను, శ్రేయోభిలాషులను అభినందించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలియజేశారు. ప్రజలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. ఆదివారం ఎండ తీవ్రత మరింతగా ఉండటంతో నగర ప్రజలు మరింత ఇబ్బందులకు ఉరికావడంతో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం వాహనదారులకు పాదచారులకు ఎంతో ఉపయోగపడింది. పార్టీకి షేక్ సత్తార్ చేస్తున్న కృషి ,సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని వారి కుటుంబ సభ్యులను ప్రతి ఒక్కరూ కొనియాడారు.ఈ కార్యక్రమంలో నూకపెయ్య సుధీర్ బాబు,గుడి దేశి శ్రీనివాస్,నేరుసు చిరంజీవి, కిలాడి దుర్గారావు, ఇనపనూరి జగదీష్ , సొంగ మధు, పార్వతి,వెంకటేశ్వరమ్మ ,లక్ష్మీ ,అపరంజి, కృష్ణవేణి, ఉమా,మంగ,శారద, రాయలసీమ భాష , నాగభూషణం,ఆటో భాష , వెంకటేష్ , నాగు,రాజు,భాస్కర్, రామకృష్ణ ,సాల్మన్ రాజు, రమణ, శ్రీను తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని వందలాది మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.


