టోల్ గేట్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
1 min read
జిల్లా ఎస్ పి కె.ప్రతాప్ శివ కిషోర్,నూజివీడు డీఎస్పీకెవివిఎన్ వి ప్రసాద్ ఆదేశాలపై రోడ్డు ప్రమాదాల నివారణకు,శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కె.ప్రతాప్ శివ కిషోర్,నూజివీడు డీఎస్పీకెవివిఎన్ వి ప్రసాద్ ఆదేశాలపై రోడ్డు ప్రమాదాల నివారణకు,శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపటారు.దీనిలో భాగంగా పెదవేగి ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్ యొక్క ఆధ్వర్యంలో పెదపాడు ఎస్ఐ ఆర్.శ్రీనివాస్ సిబ్బందితో కలిసి పెదపాడు పరిధిలో కలపర్రు టోల్ గేట్ వద్ద డ్రంకన్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిం చారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి నిర్లక్ష్యం గా వాహనాలు నడుపుతూ పట్టుబడిన ముగ్గురు వ్యక్తులపై పెదపాడు పోలీసులు కేసులు నమోదు చేసి, వారిని ఏలూరు ఎక్సైజ్ కోర్టులో హాజరు పరిచారు. కేసును విచారించిన ఏలూరు ఎక్సైజ్ కోర్టు నిందితులకు ఒక్కొక్కరికి ₹10,000/- చొప్పున, ముగ్గురికీ కలిపి మొత్తం ₹30,000/- భారీ జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.ఈ సందర్భంగా పెదపాడు ఎస్ఐ ఆర్.శ్రీనివాస్ మాట్లాడుతూ, మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదకర పరిణా మాలను వివరించారు.మద్యం సేవించి నప్పుడు మెదడు నియంత్రణ తప్పు తుంది. వాహనంపై పట్టు కోల్పోయి జరిగే ప్రమాదాల్లో వాహన దారుడి ప్రాణాలకే కాకుండా,రోడ్డుపై వెళ్లే అమాయక బాటసారుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందన్నారు.మోటారు వాహనాల చట్టం ప్రకారం డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఇప్పుడు కోర్టు విధించిన విధంగా ఒక్కొక్కరికి ₹10,000/- భారీ జరిమానాతో పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది.మద్యం సేవించి దొరికిన వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆర్టీఓ అధికారులకు సిఫార్సు చేసి శాశ్వతంగా లేదా నిర్ణీత కాలం పాటు రద్దు చేయడం జరుగుతుందని,నేర తీవ్రతను బట్టి జరిమానాతో పాటు కోర్టులు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందన్నరు.ఇంటికి ఆధారమైన వ్యక్తి ప్రమాదాల బారిన పడితే ఆ కుటుంబం వీధిన పడుతుంది.క్షణకాలం ఆనందం కోసం జీవితాలను, కుటుంబాల భవిష్యత్తు ను నాశనం చేసు కోవద్దని సూచిoచారు.పెదపాడు మండల పరిధిలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని వాహనదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాల్సిందిగా కోరరు.

