యోగ ప్రాణ శక్తి పెంపుతో ఆరోగ్యం, ఆనందం… దీర్ఘాయుష్
1 min read
-డాక్టర్ మాకాల సత్యనారాయణ
విజయవాడ, న్యూస్ నేడు : ఇంటర్నేషనల్ యోగ డే 2026 21 రోజుల ఉత్సవాలలో భాగంగా, అశోక్ నగర్ ఇండియన్ ఓం కేంద్ర కార్యాలయం వద్ద జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ మరియు అక్యూపంక్చర్ పరిశోధకుడు డాక్టర్ మాకాల సత్యనారాయణ మాట్లాడుతూ’ యోగ ప్రాణ శక్తి పెంపుతో ఆరోగ్యం, ఆనందం మరియు దీర్ఘాయుష్ లభిస్తుందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెనమలూరు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి, యావన్మంది ఫిట్ గా ఉండటానికి యోగ అత్యంత ముఖ్యమైనదిగా చెబుతూ, ప్రతి ఒక్కరూ యోగ అలవర్చుకుని,నిత్య సాధన చేయవలసిందిగా కోరారు. కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన పిఠాపురం ఉమర్ ఏలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కృష్ణా జిల్లా కన్వీనర్ వంగర రేణుక దేవి మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవతో ప్రపంచవ్యాప్తంగా యోగాకు గుర్తింపు వచ్చిందన్నారు. రాష్ట్రంలో కూడా యోగాంద్ర పేరు మీద కార్యక్రమాలకు గాను కూటమి ప్రభుత్వం ఖ్యాతి తెచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా పారిశ్రామికవేత్తల సంఘం (కోవే) మాజీ కార్యదర్శి కానూరు విజయలక్ష్మి,అస్పా భారత్ ఉపాధ్యక్షురాలు వెలగపూడి శ్రీదేవి,యోగ శక్తి సాధన సమితి కార్యదర్శి శ్రీమతి కొండవీటి సుమతి, రాష్ట్ర యోగా సంఘం ప్రతినిధి పద్మిని పాల్గొని ప్రసంగించారు. అనేక మందికి నొప్పులు తగ్గించడానికి చికిత్స చేసి,మోడీ హెల్త్ కేర్ స్టిక్స్ పంపిణీ చేశారు. రాబోయే 21 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా జరగబోయే కార్యక్రమాలను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కి సభాధ్యక్షుడు డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలియజేశారు.


