NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అవ్వాతాతలకు అండగా కూటమి ప్రభుత్వం

1 min read

– హోళగుందలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందజేసిన టీడీపీ నాయకులు

హోళగుందన్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని హొలగుంద మండలంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు మరియు ఇతర అర్హులైన లబ్ధిదారులకు వారి ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందజేస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేశారు.ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి వైకుంఠం జ్యోతి మరియు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త, ఐఓసీఎల్ డీలర్, తెలుగు యువత మాజీ రాష్ట్ర కార్యదర్శి  చిన్న హేట శేషగిరి మరియు హోళగుంద మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేశారు.పింఛన్ అందుకున్న లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమం మరియు అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా సమాజంలోని బలహీన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు కురువ మళ్లీ, ఐటీడీపీ హనుమంతు (జార్జ్), వైకుంఠం యూత్ ల్యాబ్ గిరి, బాగోడి రాముడు తదితరులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *