NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆప్యాయంగా పలకరిస్తూ పింఛన్ల పంపిణీ

1 min read

పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

నందికొట్కూరు న్యూస్ నేడు: వృద్ధులు,వితంతువులు వికలాంగుల ఇండ్లకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పంపిణీ చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని8వ వార్డులో సోమవారం 1వ తేదీ సందర్భంగా పింఛన్ లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి పింఛన్ నగదును ఎమ్మెల్యే మరియు మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి  అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.2024 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు,నారా లోకేష్ ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ నెలకు 4 వేలు పింఛన్ అందజేస్తామని ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ ఎన్ అశోక్ కుమార్,మాజీ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్, ఎస్ఎండీ జమీల్,క్లస్టర్ ఇంచార్జి లాయర్ జాకీర్, రెండవ వార్డ్ అబ్దుల్ అజీస్, ఆర్ట్ శ్రీను,బ్రహ్మయ్య,డాక్టర్ వనజ,రాజు మరియు అధికారులు పాల్గొన్నారు.

About Author