స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు రాజకీయ పార్టీలు సహకరించాలి
1 min read
అర్హత కలిగిన పౌరునికి ఓటు హక్కు కలిగి ఉండాలి
జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి
కర్నూలు, న్యూస్ నేడు: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని జిల్లా లో అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టడానికి రాజకీయ పార్టీలు సహకరించాలి అని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి పార్టీల ప్రతినిధులను కోరారు. సోమవారం సాయంకాలం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జాతీయ మరియు రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు.ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు జాబితా సవరణ ప్రక్రియను అమలు చేయడానికి అన్ని పార్టీల వారు సహకరించాలని తెలిపారు. ప్రతి అర్హత కలిగిన ఓటరుకు ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. మరణించిన, శాశ్వతంగా మారిన, నకిలీ మరియు పౌరులు కాని ఓటర్ల పేర్లను తొలగించడం ద్వారా, అర్హులైన పౌరులు వదిలివేయబడకుండా చూసుకోవడం ఓటర్ల జాబితాలు ఖచ్చితమైనవని తయారు చేసుకోవడం స్పెషల్ ఇంటెన్సీ రివిజన్ యొక్క ముఖ్య లక్ష్యం అని తెలిపారు. ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన చట్టపరమైన నిబంధనలు, విధానాలు, కాలపట్టికలు, కార్యాచరణపై రాజకీయ పార్టీల ప్రతినిధుల కు పూర్తి అవగాహన కల్పించారు . ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో అవగాహన సమావేశాలు నిర్వహించారని తెలిపారు.ఓటరు అధికారికంగా తన దగ్గర ఉన్న 12 గుర్తింపు కార్డులకు సంబంధించి ఒక పత్రం ను సెల్ఫ్ అటే స్టేషన్ చేసి ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు. 1987 లో జన్మించిన వారు ఒక కేటగిరి గా ,1987 నుండి 2004 వరకు రెండవ కేటగిరి గా, 2004 తర్వాత జన్మించిన వారు మూడవ కేటగిరీగా పరిగణించి అందుకు సంబంధించిన పత్రాలను అందజేయవలసి ఉంటుందని తెలిపారు. స్థానికంగా లేనివారి ఓటు హక్కును అన్ని విధాల పరీక్షించుకొని తొలగించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి తెలియజేశారు. రాజకీయ పార్టీ ప్రతినిధుల అనుమానాలను జిల్లా రెవెన్యూ అధికారి వెంకటనారాయణమ్మ నివృత్తి చేశారు.ఈ సమావేశంలో డీఆర్వో వెంకటనారాయణమ్మ, భారతీయ జనతా పార్టీ తరఫున నాగరాజు , సాయి ప్రదీప్ , మాలతి , రామాంజనేయులు , జనసేన పార్టీ తరఫున మంజునాథ్ , తెలుగుదేశం పార్టీ తరఫున మధుబాబు నాయుడు , ఎల్.వి.ప్రసాద్ , రాజశేఖర్ రెడ్డి , వైఎస్ఆర్ సి పి తరఫున షరీఫ్ , ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున బజార్అన్న , బహుజన సమాజ్ పార్టీ తరఫున నాగరాజు , అరుణ్ కుమార్ ఎలక్షన్స్ సెల్ సూపరింటెండెంట్ మురళి తదితరులు పాల్గొన్నారు.

