NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు భూమిపూజ ఘనంగా నిర్వహణ

1 min read

టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి, వైకుంఠం శివ ప్రసాద్ ఆదేశాలతో కార్యక్రమం

 డాక్టర్ తిప్పయ్య, ఈబీజీ గోవింద్ గౌడ్ ఆధ్వర్యంలో భారీగా పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు

ఎన్టీఆర్ అభిమానుల సందడితో విజయవంతమైన భూమిపూజ కార్యక్రమం

హొళగుంద బస్టాండ్ సర్కిల్‌లో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహణ

హోళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండల కేంద్రంలోని బస్టాండ్ సర్కిల్‌లో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, భారతదేశ రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహానేత డాక్టర్ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)  విగ్రహ ఆవిష్కరణకు భూమిపూజ కార్యక్రమం  ఘనంగా నిర్వహించబడింది.తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానటుడు, ప్రజానాయకుడు ఎన్టీఆర్  సేవలను స్మరించుకుంటూ, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు భూమిపూజ చేపట్టారు. కార్యక్రమం సందర్భంగా నాయకులు ఎన్టీఆర్  చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్  వైకుంఠం జ్యోతి , వైకుంఠం శివ ప్రసాద్  ఆదేశాల మేరకు, హొళగుంద మండల టీడీపీ కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య గారు మరియు మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్  ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచ వేదికపై చాటిచెప్పిన మహానేత ఎన్టీఆర్ ని, రాజకీయాల్లో ప్రజాసేవకు కొత్త నిర్వచనం ఇచ్చిన నాయకుడిగా ఆయన చిరస్మరణీయుడిగా నిలిచారని పేర్కొన్నారు. పేదల సంక్షేమం, మహిళల అభివృద్ధి, సామాజిక న్యాయం, తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని కొనియాడారు.ఎన్టీఆర్  విగ్రహం హొళగుందలో ప్రతిష్ఠించబడటం ద్వారా యువతకు ఆయన జీవితం ఆదర్శంగా నిలుస్తుందని, తెలుగు జాతి గర్వకారణమైన మహానేతను నిరంతరం స్మరించుకునే అవకాశం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. విగ్రహం ఏర్పాటు ప్రాంత ప్రజలకు ప్రత్యేక గుర్తింపును తీసుకురావడంతో పాటు తెలుగు దేశం పార్టీ సిద్ధాంతాలను, ఎన్టీఆర్ ఆశయాలను ప్రజల్లో మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు.కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పంపాతి , యారిస్వామి , డీడీ వెంకటేష్ గారు, అంజి , మాజీ మండల కన్వీనర్ వీరన్న గౌడ్ , కురువ మల్లి , టిడిపి మండల అధ్యక్షుడు ముల్లా మొయిన్ , వడ్డే యారిస్వామి , కోగిలతోట శేషిరెడ్డి , యువ నాయకులు ల్యాబ్ గిరి , రారాయి సిద్ధు, హెసాన్, బి. మంజు, బి. వీరేశ్, ఇబాదుల్లా  తదితరులు పాల్గొన్నారు.అలాగే ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భూమిపూజ కార్యక్రమం అనంతరం నాయకులు ఎన్టీఆర్  ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని సంకల్పం వ్యక్తం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *