హోళగుందలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం
1 min read
బస్టాండ్ నుంచి అయోధ్య నగర్ వరకు ప్రధాన రహదారి అభివృద్ధి
సీసీ రోడ్డు నిర్మాణంతో ప్రజల్లో హర్షం – ప్రయాణ ఇబ్బందులకు చెక్
హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండల కేంద్రంలోని బస్టాండ్ నుంచి సినిమా థియేటర్ మీదుగా అయోధ్య నగర్ వరకు గల ప్రధాన రహదారికి సీసీ రోడ్డు నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హోళగుంద నుంచి ఆలూరుకు వెళ్లే ప్రధాన మార్గంలో ఈ పనులు చేపట్టడంతో స్థానికులు, వ్యాపారులు, వాహనదారులు మరియు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.గతంలో రహదారి దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యేవని, ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యేవారని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడంతో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.ఈ రహదారి నిర్మాణం పూర్తయిన అనంతరం హోళగుంద–ఆలూరు ప్రధాన మార్గంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

