యోగ సాధన తో ఆరోగ్యం, ఆనందం .. దీర్ఘాయుష్ -డాక్టర్ ఉమర్ ఆలీషా
1 min read
పిఠాపురం, న్యూస్ నేడు : ఇంటర్నేషనల్ యోగ డే 2026 21 రోజుల ఉత్సవాలలో భాగంగా,పిఠాపురం మహర్షి మొహిద్దీన్ బాదుషా జ్ఞాన సభా మందిరం వద్ద జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీటాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా మాట్లాడుతూ’ యోగ సాధన పెంపుతో ఆరోగ్యం, ఆనందం మరియు దీర్ఘాయుష్ లభిస్తుందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ మాకాల సత్యనారాయణ మాట్లాడు తూ యావన్మంది ఫిట్ గా ఉండటానికి యోగ అత్యంత ముఖ్యమైనదిగా చెబుతూ, ప్రతి ఒక్కరూ యోగ అలవర్చుకుని,నిత్య సాధన చేయవలసిందిగా కోరారు. కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన పిఠాపురం ఉమర్ ఏలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కృష్ణా జిల్లా కన్వీనర్ వంగర రేణుకా దేవి మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవతో ప్రపంచవ్యాప్తంగా యోగాకు గుర్తింపు వచ్చిందన్నారు. రాష్ట్రంలో కూడా యోగాంద్ర పేరు మీద కార్యక్రమాలకు గాను కూటమి ప్రభుత్వం ఖ్యాతి తెచ్చిందన్నారులో.అనేక మందికి నొప్పులు తగ్గించడానికి చికిత్స చేసి,మోడీ హెల్త్ కేర్ స్టిక్స్ పంపిణీ చేశారు. రాబోయే 20 రోజులపాటు యోగ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది
డాక్టర్ మాకాల సత్యనారాయణ
వ్యవస్థాపక చైర్మన్
యోగ శక్తి సాధనా సమితి విజయవాడ తెలిపారు. డాక్టర్ ఉమర్ ఆలీషా విజయవాడ యోగ శక్తి సాధన సమితి యవస్థాపక చైర్మన్ మరియు అక్యూపంక్చర్ పరిశోదకుడు డాక్టర్ మాకాల సత్యనారాయణ ను ఘనంగా సన్మానం చేసినారు. ఉమర్ ఆలీషా ట్రస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు ఏ వి వి సత్యనారాయణ మరియు పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు కార్యక్రమం నిర్వహించి, వందన సమర్పణ చేసారు.యోగ తెరపిస్ట్ వంగర అంబిక దేవి, కరుణాకర్, వీరమ్మ వగైరా పాల్గొన్నారు.


