విద్యాబోధన పద్ధతులపై అవగాహన సదస్సు…
1 min read
ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్న మోటివేషనల్ స్పీకర్ హర్ష కిరణ్
న్యూస్ నేడు, పత్తికొండ: విద్యా బోధన పద్ధతులపై మోటివేషనల్ స్పీకర్ హర్ష కిరణ్ అరసం రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ లు , యస్ టి యు సీనియర్ నాయకులు నారాయణ గురువారం శాంతి టాలెంట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల లోపాఠశాల అడ్మినిస్ట్రేటర్ నాగరాజు అధ్యక్షతన ఉపాధ్యాయుల కు ప్రేరణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హర్ష కిరణ్ మాట్లాడుతూ, ప్రేరణ అనేది ఒక అంతర్గత స్థితి అని, ఇది వ్యక్తులను లక్ష్య ఆధారిత ప్రవర్తనలో పాల్గొనేలా నడిపిస్తుందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా విద్యాబోధన చేసి వారిలో నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం. నాగరాజు, హమీద్, రజనీకాంత్, శ్రీలత, సరోజ, శ్రీవిద్య, మహబూబ్ బి, లావణ్య, రమాదేవి,అనురాధ, భారతి, కామాక్షి, స్వాతి, వైష్ణవి, గాయత్రి, రామాంజినమ్మ తదితరులు పాల్గొన్నారు.

