NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’

1 min read

టీడీపీ ప్రతులను కాల్చివేసిన వైసీపీ నాయకులు

మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు పార్టీ అని మిడుతూరు వైసీపీ నాయకులు అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో రాష్ట్ర వైసీపీ పార్టీ పిలుపు మేరకు జూన్ 4 నుండి 12వ తేదీ వరకు’చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ అనే కార్యక్రమానికి ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలనే పార్టీ పిలుపుతో మిడుతూరు మండల కేంద్రంలో వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు.పాత తహసిల్దార్ కార్యాలయం నుండి ఆటో స్టాండ్ ప్రాంతం వరకు చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు అనే పోస్టర్లను చేత పట్టుకుని వైసీపీ నాయకులు ర్యాలీగా ఆటో స్టాండ్ వరకు వచ్చారు.ఈ సందర్భంగా జెడ్పిటిసి సభ్యులు పర్వత యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం చెందిందని ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజల్లోకి తీసుకు వెళ్దామని అన్నారు.తర్వాత చంద్రబాబు,పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఎన్నికల ముందు విడుదల చేసిన హామీల ప్రతులను వైసిపి నాయకులు కాల్చివేశారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ తువ్వా చిన్న మల్లారెడ్డి,జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, నాగ తులసి రెడ్డి,వైస్ ఎంపీపీ నబి రసూల్,ఎంపీటీసీ గుండం హరి సర్వోత్తమ్ రెడ్డి, నాగ స్వామి రెడ్డి,వెంకటేశ్వర్లు సుంకేసుల రాముడు, నారాయణరెడ్డి,షరీఫ్,  రవికుమార్,మహబూబ్ బాష,షఫీ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *