NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లోపాలు గుర్తిస్తే వాటిని నివారించవచ్చు

1 min read

శిక్షణ కార్యక్రమంలో సిడీపీఓ మంగవల్లి..

 మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: చిన్నపిల్లల్లో ఉండే శారీరక లోపాలను వెంటనే గుర్తించినట్లయితే వారిలో ఉన్న లోపాలను నివారించవచ్చని నందికొట్కూరు సిడిపిఓ మంగవల్లి అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో మోడల్ పాఠశాలలో శుక్రవారం మండల స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలకు ఐసిడిఎస్ సూపర్వైజర్లు వరలక్ష్మి,రేణుకా దేవి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ (ఈసీడీ) స్క్రీనింగ్ గురించి వివరించారు.అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతి పిల్లవాడికి 0 నుండి 3 సం.ల లోపు పిల్లలందరికీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుందని చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలతో ప్రేమ,ఆటలు, మాట్లాడటం వంటివి చేయాలి.పిల్లల్లో చిన్న వయస్సులోనే ఈ స్క్రీనింగ్ ద్వారా లోపాలు గుర్తించినట్లయితే త్వరగా నివారించవచ్చు.పుట్టుకతో వచ్చే లోపాలు అంగవైకల్యం వంటి లోపాలను మరియు సరియైన సమయంలో వచ్చే లోపాలన్ని గుర్తించి సరియైన సమయంలో జాగ్రత్తలు తీసుకొని మన పిల్లలను మనం కాపాడుకోగలము. పిల్లలే మన సంపద.కాబట్టి పిల్లలకు స్క్రీనింగ్ చేసేటప్పుడు తల్లి మరియు కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఉండాలి.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దశరథ రామయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *