NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కూటమి ప్రభుత్వంలోనే పట్టాదార్ పాస్ పుస్తకాలు 

1 min read

చెరుకుచెర్ల’లో పాస్ పుస్తకాల పంపిణీలో ఎమ్మెల్యే..

మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: కూటమి ప్రభుత్వంలోనే రైతులకు పట్టాదార్ పొలం పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చెరుకుచెర్ల గ్రామంలో శనివారం ఉదయం’మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా  రైతులకు రైతులకు 550 పట్టాదారు పొలం పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన పట్టాదారు పాసుపుస్తకాలతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రైతుల హక్కులు రక్షించేందుకు ప్రభుత్వం రీ సర్వే 2.0 చేపట్టిందన్నారు.భూమిపై రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం “మీ భూమి-మీ హక్కు” కార్యక్రమాన్ని అమలు చేసిందన్నారు.సాంకేతిక పరిజ్ఞానంతో పాస్ పుస్తకాలను తయారు చేసినట్లు వెల్లడించారు. తర్వాత అంగన్వాడీ మరియు గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు.రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రైతుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి,ఎంపీడీవో దశరథ రామయ్య,తహసిల్దార్ శ్రీనివాసులు,మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి,క్లస్టర్ ఇన్చార్జి వంగాల శివరామిరెడ్డి,భూపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ నాగ స్వామి రెడ్డి,సర్వోత్తమ్ రెడ్డి,చాకర్ వలి, రాముడు, విఆర్ఓ బాలన్న,పంచాయతీ కార్యదర్శి సామేలు  తదితరులు పాల్గొన్నారు.

About Author