కర్నూలులో కొనసాగుతున్న ‘జ్ఞానప్రకాష్’ FLN 3వ సంవత్సర శిక్షణా తరగతులు
1 min read
కర్నూలు (సిటీ), న్యూస్ నేడు : స్థానిక CRRM , SAP CAMP ఉన్నత పాఠశాలలో ప్రాథమిక తరగతుల (1, 2 తరగతులు) ఉపాధ్యాయులకు 60 రోజుల సర్టిఫికేట్ కోర్సులో భాగంగా ‘జ్ఞానప్రకాష్’ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) మూడవ సంవత్సర శిక్షణా తరగతులు జూన్ 4వ తేదీన ప్రారంభమై విజయవంతంగా కొనసాగుతున్నాయి. మూడవ రోజు శిక్షణ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని 523 మంది ఉపాధ్యాయులు హాజరై చురుగ్గా భాగస్వాములయ్యారు.ఆటపాటలతోనే ప్రాథమిక విద్య: ఈ శిక్షణ కార్యక్రమం గురించి SAP CAMP స్పెషల్ బెటాలియన్ డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ మహబూబ్ బాషా గారు, సమగ్ర శిక్ష రాష్ట్ర పరిశీలకులు ఉపాధ్యాయులతో మాట్లాడారు. జాతీయ విద్యా విధానం (NEP 2020) మరియు FLN మార్గదర్శకాల ప్రకారం ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఒత్తిడి లేని బోధన అందాలన్నారు. ఆట ఆధారిత, కృత్యాధారిత, బొమ్మల ఆధారిత విధానాల ద్వారా చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణంలో బోధన సాగాలని ఉపాధ్యాయులకు వివరించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ, విద్యార్థులతో మమేకమై నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలని పిలుపునిచ్చారు.రేపటి పౌరులను తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని, ఒకటి మరియు రెండు తరగతుల పిల్లల్లో పునాది అభ్యసనాన్ని (Foundational Learning) బలోపేతం చేస్తూ, సంఖ్యా భావనను సులభంగా గుర్తించే నైపుణ్యాలను పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు.శిక్షణా తరగతుల పరిశీలనఈ శిక్షణా తరగతుల నిర్వహణను SAP CAMP స్పెషల్ బెటాలియన్ డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ మహబూబ్ బాషా ,ఉపాధ్యాయుల కృత్యాధార బోధనా పద్ధతులను పరిశీలించారు, రాష్ట్ర పరిశీలకులు సురేష్ కుమార్ సందర్శించి ప్రత్యేకంగా పరిశీలించారు.ఈ కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్ MEO-1 కర్నూలు అర్బన్ నాగ చౌడయ్య, SAP CAMP CRRM హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకట్ రెడ్డి ,AMO రఫీక్ గారు, K.R.P. కళ్యాణిగారు, మరియు వివిధ విభాగాల DRP లు పాల్గొని శిక్షణను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.


