ఈ నెల 9వ తేదీన జరిగే రాస్తారోకోలను జయప్రదం చేయండి
1 min read
పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలి
సిపిఐ ఏలూరు జిల్లా సమితి కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య
సిపిఐ ఏలూరు జిల్లా సమితి సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలను తగ్గించాలని ఆర్.ఆర్.పేట పార్కు ఆందోళన కార్యక్రమం నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ ఏలూరు జిల్లా సమితి కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఎక్కడో జరుగుతున్న యుద్ధం వలన భారత దేశంలో పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచి వేస్తుందని ఆరోపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు పెంచమని డాంబికాలు పలికారని ఎద్దేవా చేశారు. ఎన్నికల అనంతరం పశ్చిమాసియా దేశాల యుద్ధాలను కారణంగా చూపి పది రోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచడం వలన ఈరోజు 115 రూపాయలకు పెట్రోల్, డీజిల్ 105, గ్యాస్ 3400 రూపాయలకు ధర పెరిగిందని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు అనేకసార్లు తగ్గినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగినప్పుడు పన్నులు తగ్గించవలసి ఉన్నప్పటికీ తగ్గించడం లేదని ఆరోపించారు. మన రాష్ట్రంలో కాకినాడ కేజీ బేసిన్ నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్ లో 50% మన రాష్ట్రానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై ఈ నెల 9వ తేదీన జరిగే రాష్ట్రవ్యాప్త రాస్తారోకో కార్యక్రమాలకు సిపిఐ ఇతర వామపక్షాలు పిలుపునిచ్చాయని మన జిల్లాలో జరిగే కార్యక్రమాలలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.సిపిఐ ఏలూరు జిల్లా సమితి సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం దేశవ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ ధరలను పెంచి ప్రజలపై ఆర్థిక భారాలు వేసిందని ఆరోపించారు.ఇది చాలాదన్నట్లుగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ఒకేసారి 950 రూపాయలు పెంచి చిన్న చిన్న హోటల్స్,స్వయం ఉపాధి పొందే వారిపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని వేసిందని ఆరోపించారు. గత వారం రోజుల్లో రెండుసార్లు వంట గ్యాస్ ధరను పెంచడమే కాకుండా ఈరోజు మరోసారి వంటగ్యాస్ ధరను పెంచడం వలన ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విధంగా పెట్రోల్, డీజిల్,గ్యాస్ ధరలను పెంచడం వలన రవాణా చార్జీలు పెరిగి నిత్యవసర ధరలు విపరీతంగా పెరిగాయని విమర్శించారు.సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ పశ్చిమాసియా దేశాలలో యుద్ధం ప్రారంభమైన వారం రోజులకే దేశంలో విపరీతమైన సంక్షోభం ఏర్పడిందని దాన్ని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్,గ్యాస్ ధరలు తగ్గించాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఉత్తర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం పాత బస్టాండ్ వద్ద జరిగే రాస్తారోకో కార్యక్రమాన్ని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ల వరప్రసాద్,కార్యవర్గ సభ్యురాలు కొల్లూరి సుధారాణి,గొర్లి స్వాతి, శాయన అభిలాష్ కుమార్, కౌన్సిల్ సభ్యులు కొండేటి రాంబాబు,బాలిన కృష్ణ ప్రసాద్,ఉప్పులూరి లక్ష్మి,కుమార్ బాబు,తదితరులు పాల్గొన్నారు.


