NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కాళ్లపై వెళ్లిన లారీ..తీవ్ర గాయాలు

1 min read
Lorry runs over legs, serious injuries

బైక్ ను ఢీకొని ఆటో పరార్.. 

మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో వివిధ ప్రాంతాల్లో నందికొట్కూరు రహదారిలో ఉన్న పంచముఖి గోడౌన్ దగ్గర ఇద్దరికీ మరియు  రోల్లపాడులో జరిగిన రెండు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఓర్వకల్లు మండలం కేతవరం గ్రామానికి చెందిన గొల్ల ప్రసాద్  నందికొట్కూరు నుండి గడివేములకు ట్రాక్టర్ నడుపుతూ వెళ్తూ ఉండగా వర్షం వస్తుండగా రోళ్ళపాడు దగ్గర ట్రాక్టర్ ను సైడుకు ఆపి అక్కడే ఆగి ఉన్న లారీ కింద కూర్చుని బీడీ తాగుతూ ఉండగా అకస్మాత్తుగా లారీ రెండు కాళ్ళపై వెళ్లడంతో స్థానికులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.అదేవిధంగా సోమవారం ఉ 9 గంటల సమయంలో గడివేములకు చెందిన బోయ మాచర్లు, దొమ్మరి ఆంజనేయులుఇద్దరు బైక్ పై నందికొట్కూర్ సంతలో ఎద్దులను కొనుగోలు చేసేందుకు వెళ్తుండగా పంచముఖి గోడౌన్ దగ్గర నందికొట్కూరు నుండి మిడుతూరు వైపు వెళ్తున్న ఆటో బైకును ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు.వీరు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు వారు తెలిపారు.సీసీ కెమెరాల ద్వారా ఆటోను గుర్తించే పనిలో ఉన్నామని పోలీసులు తెలిపారు.అదేవిధంగా చెరుకుచెర్ల నుండి మిడుతురుకు బైక్ వెనుక కూర్చున్న మౌలాబీ కిందపడడంతో స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు.

About Author