ఎస్సి హోదా పై రౌండ్ టేబుల్ సమావేశం
1 min read
గత 70 ఏళ్ల నుంచి ఈ పోరాటం నడుస్తూనే ఉంది
హైకోర్టు న్యాయవాది,నేషనల్ దళిత జేఏసీచైర్మన్ పెరికె వరప్రసాదరావు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: సోమవారం న్యూఢిల్లీ ఏపీ భవన్ ఫస్ట్ ఫ్లోర్ గురజాడ కాన్ఫరెన్స్ హాల్ ఫస్ట్ ఫ్లోర్ సమావేశ హాల్నందు గురజాడ లో రౌండ్ టేబుల్ మీటింగ్ విజయవంతమైన రౌండ్ టేబుల్ సమావేశం నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికె వరప్రసాదరావు హైకోర్టు న్యాయవాది ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ఈ జడ్జ్మెంట్ మనకు కొత్త ఏమీ కాదు. గత 70 ఏళ్ల నుంచి ఈ పోరాటం నడుస్తూనే ఉంది.ఈ వివాదం పై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ నడుస్తూనే ఉంది. దీనిపై ఇంకా ఎటువంటి జడ్జిమెంట్ ఇంకా రాలేదు. రిటైర్ ఐఏఎస్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయకుమార్ మాట్లాడుతూవాస్తవానికి ఈ జడ్జిమెంట్ ఒక పాస్టర్, తను ఒక దళిత క్రైస్తవుడైయుండి (బీసీ-సి) అట్రాసిటీ కేసు వర్తిస్తుందని వేసిన వ్యక్తిగతమైన కేసు.ఫిర్యాదుదారుడు ఒక పాస్టర్ అయివుండి కూడా అట్రాసిటీ కేసు వర్తిస్తుందని హైకోర్టుకు వెళ్లడం వలన, హైకోర్టు కాదని చెప్పడం మరల స్పెషల్ లీవ్ పిటిషన్ కింద సుప్రీంకోర్టుకు వెళ్లడం తో గౌరవ సుప్రీంకోర్టు , ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదు అట్రాసిటీ యాక్టివ్ వర్తించదని చెప్పారు. ఉదిత్ రాజ్ మాజీ ఎంపీ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలన్న నినాదంతో గతం లో ఇచ్చిన 1976 ,1985 జడ్జిమెంట్ లను సవాల్ చేస్తూ, కన్స్టిట్యూషన్ (షెడ్యూల్డ్ క్యాస్టస్ ) ఆర్డర్ 1950 పేరాను తొలగించాలని కోరుతూ నాకు తెలిసి సుమారు 15 పిటిషన్స్ సుప్రీంకోర్టులో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని పిటిషన్స్ దాఖలయ్యాయి. వీటన్నింటినీ కలిపి సుప్రీం కోర్ట్ విచారణ చేస్తూఉంది.ఈ పిటిషన్ లలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వకూడదని ఎటువంటి జడ్జిమెంట్ నేటికి ఇవ్వలేదు. పెరి కె.వరప్రసాదరావు హైకోర్టు న్యాయవాది ఆ రిట్ పిటిషన్ ల వివరాలు
W.P.(C). 180/2004, C.A.No.323/2004
C.A.No.324,325/2004
C.A.No.326,327/2004
C.A.No.328/2004
C.A.No.329,330/2004
W.P.(C).94/2005
W.P.(C). 625/2005
C.A.No. 2429,2430/2005
W.P.(C). 579/2009
W.P.(C). 109/2011
W.P.(C).259/2012
SLP(C).38003/2013
దీనిపై ఇంకా సుప్రీంకోర్టు లో విచారణ నడుస్తోంది. ఎటువంటి జడ్జిమెంట్ ఇవ్వలేదని తెలిపారు. ఇటీవల జస్టిస్ బాలకృష్ణ ఏకసభ్య కమిషన్ దీనిపై భారత దేశంలో విచారణ కొనసాగించి కేంద్రానికి నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉందిఅన్నారు.మాజీ ఎంపీ హర్ష కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ,బాపట్ల జిల్లాలో ఒక పాస్టర్ పై జరిగిన దాడిలో అట్రాసిటీ కేసు వర్తించాలని వెళ్లిన చింతాడ ఆనంద్ Vs స్టేట్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ అండ్ అథెర్స్ ఎస్ (Crl ) No 9231/2025 కేసులో నేడు సుప్రీమ్ కోర్టులో 2026 మార్చి 24న ఇచ్చిన జడ్జిమెంట్ వ్యక్తి గతమైన కేసులో ఇచ్చిన జడ్జిమెంట్. ఈ ప్రత్యేక కేసులో అట్రాసిటీ కేసు వర్తించదు అన్న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సమర్ధనీయం . ఇది ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టంలో స్పష్టంగా చెప్పబడుతుంది. ఇండియన్ కల్టివేషన్ రైట్స్ ఢిల్లీ స్టేట్ అధ్యక్షులు మార్టిన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛను కల్పిస్తూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలనీ, రాజ్యాంగ స్ఫూర్తిగా వ్యతిరేకంగా ఉన్న కాన్స్టిట్యూషన్ (షెడ్యూల్ కాస్ట్) ఆర్డర్ 1950 తొలగించాలన్న డిమాండ్ తో నడుస్తున్న కేసులో నేటికి ఎటువంటి తీర్పు ఇవ్వలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ గాలి వినోద్,డాక్టర్:షేక్ ఇస్మావుద్దీన్ జాన్ మాస్క్ క్రిస్టియన్ బోర్డ్ చైర్మన్ తోట డేవిడ్రాజు,చైర్మన్ ఉమానిటీ ఫర్ విట్టెం ఫౌండేషన్ బుర్రి ప్రతాప్ కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా వైస్ ప్రెసిడెంట్ ఇస్తే రాణి,క్రిస్టియన్ యూత్ ఫోర్స్ అధ్యక్షుడు ప్రసంగి మరియు సతీష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


