మద్ది దేవస్థానం లో యెగాంద్ర కార్యక్రమం
1 min read
సుమారు 2365 భక్తులకు నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాద వితరణ
వివిధ సేవల రూపేణా రూ.3,55,857/-లు ఆదాయo
భక్తుల ఆర్దిక సహకారంతో మంచినీటి ఆర్ఓ ప్లాంట్ ప్రారంభo
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: మంగళవారం సందర్భముగా ఏలూరుజిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధము చుట్టు ప్రక్కల గ్రామముల నుండియే గాక సుదూర ప్రాంతముల నుండి అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కుబడులు తీర్చుకుని, శ్రీ స్వామి వారికి అత్యంత ప్రీతీకరమైన తమలపాకులు (నాగవల్లీ దళములు)తో అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు, వాహనం పూజలను ఆలయ అర్చకులచే నిర్వహించుకునినారు.మంగళవారం శ్రీ స్వామి వారి దర్శనార్ధం మద్యాహ్నం/సాయంత్రం గం.3-00 వరకూ విచ్చేసిన సుమారు 2365 భక్తులకు శ్రీ స్వామి వారి నిత్యాన్నదాన సత్రము నందు అన్నప్రసాద వితరణ జరుపబడినది. ఈ రోజు మద్యాహ్నం/సాయంత్రం గం.3-30 ని.ల వరకూ శ్రీ స్వామి వారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణా రూ.3,55,857/-లు ఆదాయము వచ్చినది. శ్రీ స్వామి వారి దేవస్థానం నందు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు “యెగాంద్ర” లో భాగంగా ఈ రోజు ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు యోగా కార్యక్రమం నిర్వహించబడినది. యెగా మాస్టర్ తాండ్ర దిలీప్ ఆద్వర్యములో ఈ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమములో జంగారెడ్డిగూడెం మునిసిపల్ కమీషనరు వారు మరియు రెవిన్యూ అధికారులు పాల్గొనినారు అని ఆలయ ధర్మ కర్తల మండలి అద్యక్షులు రాజాన సత్యనారాయణ మరియు ఆలయ అసిస్టెంట్ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెల్పినారు.అలాగే శ్రీ స్వామి వారి దేవస్థానం నందు హైదరబాద్ కి చెందిన దాతలు ‘వంకిన నాగ శ్రీనివాస్ ప్రసాద్ & లక్ష్మి చంద్ర పద్మావతి’ దంపతుల ఆర్దిక సహకారంతో భక్తుల సౌకర్యార్ధం నిర్మించిన మంచినీటి ఆర్ ఓ ప్లాంట్ ను ఉదయం ప్రారంభించినారు. ఈ కార్యక్రమములో జంగారెడ్డిగూడెం నవభారత్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ సిబ్బంది, కూటమి నాయకులు రావూరి కృష్ణ ,దాకారపు కృష్ణ ,కె.మాధవరావు ఇతర నాయకులు ధర్మకర్తల సభ్యులు ఓబిళ్ళనేని సూర్యభవానీ, చింతపల్లి రత్నసురేష్ ,వల్లూరి సునీత, తిరుమలశెట్టి నాగ వరలక్ష్మి అనీల, దూనబోయిన నారాయణ మూర్తి,నడిపల్లి విధ్యాధర్, మరియు ఆరుగొల్లు సావిత్రి పాల్గొన్నరు. ఆలయ ధర్మ కర్తల మండలి అద్యక్షులు రాజాన సత్యనారాయణ మరియు ఆలయ అసిస్టెంట్ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెల్పిరు.



