ఫ్రూట్ జ్యూస్ లు ప్రజల ఆరోగ్యానికి హానికరంగా ఉన్నాయన్న ఫిర్యాదులు
1 min read
ప్రజా ఆరోగ్యానికి హానికరంగా ఉన్నట్లు గుర్తించాం
ఫుడ్ సేఫ్టీ అధికారి కోన.వెంకటేశ్వరరావు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు: రాష్ట్రవ్యాప్తంగా జ్యూస్ షాపుల్లోనూ టీ షాపుల్లో విక్రయిస్తున్న ఫ్రూట్ జ్యూస్ లు ప్రజల ఆరోగ్యానికి హానికరంగా ఉన్నాయన్న ఫిర్యాదులతో ఏలూరు వన్ టౌన్ లోని తాజ్ సూపర్ కూల్డ్రింక్స్ అండ్ ఫ్రూట్ జ్యూస్ షాపును ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం తనిఖీ చేశారు.ఇందులో భాగంగా కాలం చెల్లిన పాల ప్యాకెట్లతో జ్యూసులు తయారు చేస్తున్నట్లు శీతల పానీయాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వారు విక్రయిస్తున్న కొన్ని లెసన్స్ కూడా ప్రజా ఆరోగ్యానికి హానికరంగా ఉన్నట్లు గుర్తించమని ఫుడ్ సేఫ్టీ అధికారి కోన వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ దుకాణం నుండి సేకరించిన శాంపిల్స్ ను లాక్ చేసి ల్యాబ్ కు పిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.ప్రజారోగ్యానికి హాని కలిగించే ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడిన వారి పై చట్టప్రకారం కఠిన చర్యలు చేపడతామని వెంకటేశ్వరరావు హెచ్చరించారు.



