NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉపాధి పని చేస్తూ మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాలి

1 min read

ప్రదీప్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యేకు సీపీఎం వినతి..

నందికొట్కూరు న్యూస్ నేడు: ఉపాధి హామీ పని చేస్తూ మరణించిన పెరుమాళ్ళ ప్రదీప్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం నాయకులు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్యకు వినతిపత్రం అందజేశారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం జరిగిన’మీ భూమి-మీహక్కు’ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.మే 26వ తేదీన ఉపాధి పనికి వెళ్లిన పగిడ్యాలకు చెందిన ప్రదీప్ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు.వెంటనే కూలీలు గమనించి వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు.ఉపాధి పనికి వెళ్లి వచ్చిన తర్వాత భారత్ గ్యాస్ డెలివరీ బాయ్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడని సీపీఎం మండల కార్యదర్శి పి.పక్కిర్ సాహెబ్,సిఐటియు జిల్లా నాయకులు గోపాలకృష్ణ కేవీపీఎస్ జిల్లా నాయకురాలు గంధం ఉశేనమ్మ కలసి ప్రదీప్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.ప్రదీప్ కు ఇద్దరు కూతుర్లు కుమారుడు ఉన్నారని ప్రదీప్ మరణించి 15 రోజులు అవుతున్నా అధికారులు ఇంతవరకు ఆదుకోలేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉపాధి హామీ పథకం పని చేస్తూ మరణించిన ప్రదీప్ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. కుటుంబాన్ని ఆదుకొని పక్షంలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేపడతామని హెచ్చరించారు.ఉపాధి కూలీ మరణిస్తే కనీసం మట్టి ఖర్చులకు కూడా అధికారులు ఆర్థిక సహాయం అందజేయలేదని వారు అసహనం వ్యక్తం చేశారు.

About Author