జిల్లా లయన్స్ క్లబ్బుల నూతన అధికారులకు శిక్షణ కార్యక్రమం
1 min read
ప్రతి క్లబ్ చేసే సేవా కార్యక్రమాలను ఇంటర్నేషనల్ పోర్టల్ ద్వారా సమాజానికి తెలియజేయలి
గ్లోబల్ లీడర్షిప్ కో-ఆర్డినేటర్ పుట్టా విజయశ్రీ అధ్యక్షతన శిక్షణ కార్యక్రమం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరులోని న్యూ అశోక్ నగర్ లో గల ఏలూరు హేలాపురి లయన్స్ క్లబ్ భవనంలో రాబోయే సంవత్సర నూతన లయన్స్ క్లబ్ అధికారులకు గ్లోబల్ లీడర్షిప్ కో- ఆర్డినేటర్ పుట్టా విజయశ్రీ అధ్యక్షతన శిక్షణ కార్యక్రమంఆదివారం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా గవర్నర్ ఎన్.వి.వి.ఎస్.పాపారావు నాయుడు మాట్లాడుతూ ఈ సంవత్సరం లయన్స్ నాయకులు లయన్స్ క్లబ్ ఫౌండేషన్ కి ఇచ్చిన విరాళాలు, చేసిన సామాజిక సేవలు మన జిల్లాను ఉన్నత స్థితిలో ఉంచాయని అలాగే జూలై నుంచి రాబోయే నూతన లయన్స్ సంవత్సరంలో కూడా సహాయ సహకారాలు అందిస్తూ జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఇంటర్నేషనల్ స్థాయిలో కల్పించాలని అన్నారు. జూలై నెల నుండి నూతన గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించబోయే విజయ స్కిన్ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ డి. సుబ్బారావు మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమంలో లయన్స్ ఇంటర్నేషనల్ పోర్టల్ లో లయన్స్ సేవా కార్యక్రమాలను ఇంటర్నేషనల్ స్థాయికి ఎలా తీసుకువెళ్లాలి,విరాళాల సేకరణ, పర్మినెంట్ ప్రాజెక్టుల ప్రాధాన్యత, క్లబ్ అధ్యక్ష,కార్యదర్శులు, కోశాధికారుల బాధ్యతలు తదితర అంశాలపై శిక్షణను ఇచ్చామని, లయన్స్ ఆఫీసర్లు చక్కటి జ్ఞానాన్ని పొందినందుకు వారిని అభినందిస్తున్నామని, ప్రతి క్లబ్ చేసే సేవా కార్యక్రమాలను ఇంటర్నేషనల్ పోర్టల్ ద్వారా సమాజానికి తెలియజేయాలని అన్నారు.ఈ కార్యక్రమానికి ఫ్యాకల్టీగా జిల్లా పూర్వ గవర్నర్ లు డాక్టర్ వి కే పంకజాక్షన్, ఈపూరి సత్యనారాయణ, కాకరాల వేణుబాబు,వి. మురళీమోహనరావు,సీనియర్ లయన్స్ అధికారులు కొరిపల్లి సత్యనారాయణ, నాగమల్లేశ్వరరావు,నందుల సీతారామారావు తదితరులు వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో ప్రథమ వైస్ గవర్నర్ ఆర్ వి ఎస్ సూర్యనారాయణ రాజు,ద్వితీయ వైస్ గవర్నర్ వి.సత్యస్వరూప్,జిల్లా క్యాబినెట్ కార్యదర్శి ఎల్ వెంకటేశ్వరరావు, జిల్లా క్యాబినెట్ ట్రెజరర్ కె.బి రావు,జిల్లా నాయుకులు కూర్మా శ్రీనివాస్,డి. హేమసుందర్ రీజియన్ చైర్ పర్సన్స్ శాఖమూడి మురళీకృష్ణ ,దేవరకొండ వెంకటేశ్వర్లు,పి.మురళీ కృష్ణంరాజు,కె.సజని,ఎం.వి.వి. నరసింహా మూర్తి,జగన్నాధరాజు, జోన్ చైర్ పర్సన్స్,జిల్లాలోని విభిన్న క్లబ్ ల అధ్యక్ష,కార్యదర్శి, కోశాధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం మోడరేటర్ గా వై సత్యనారాయణ వ్యవహరించారు.లయన్స్ జిల్లా నలుమూలల నుంచి 180మంది లయన్స్ పాల్గొన్నారు.



