కర్నూలు జిల్లా అభివృద్ధిపై మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇంచార్జిల సమావేశం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా అభివృద్ధిపై జిల్లా ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి టీజీ భరత్ గుప్తా జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించారు. విజయవాడలోని జలమండలి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, పత్తికొండ ఎమ్మెల్యే కె.ఈ శ్యాంబాబు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, ఆదోని ఇంచార్జి మీనాక్షి నాయుడు, మంత్రాలయం ఇన్చార్జి రాఘవేంద్ర రెడ్డి, ఆలూరు ఇన్చార్జి వైకుంఠం జ్యోతి పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానంగా జిల్లా అభివృద్ధిపై చర్చించారు.


