మత సామరస్యం, సోదరభావం సమాజ అభివృద్ధికి మూల స్తంభాలు
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: మత సామరస్యం, సోదరభావం సమాజ అభివృద్ధికి మూల స్తంభాలని డోన్ నియోజకవర్గం శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు.ఈసందర్భంగా గురువారం ప్యాపిలి మండలంలోని జలదుర్గం గ్రామంలో నిర్వహించిన జామియా మస్జిద్ పునఃనిర్మాణ బునియాద్ (భూమిపూజ) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి హాజరై జామియా మస్జిద్ పునఃనిర్మాణ బునియాద్ (భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత సామరస్యం, సోదరభావం సమాజ అభివృద్ధికి మూల స్తంభాలని పేర్కొన్నారు. జామియా మస్జిద్ పునఃనిర్మాణం గ్రామ ప్రజల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు పరస్పర సహకారంతో ముందుకు సాగి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం మస్జిద్ పునఃనిర్మాణ పనులు విజయవంతంగా పూర్తికావాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక దువా కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, ముస్లిం సోదరులు ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు లక్క సాగరం లక్ష్మి రెడ్డి, తేదేపా నాయకులు చండ్రపల్లి లక్ష్మి నారాయణ యాదవ్, ఆర్ ఇ నాగరాజు,రమణ గౌడ్, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



