NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హోళగుందమండల నూతన ఎంపీడీవో సయ్యద్ ఉమర్‌కు ఘన సన్మానం

1 min read

హోళగుందన్యూస్ నేడు: హోళగుందమండల నూతన ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన సయ్యద్ ఉమర్కు స్థానిక ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ తనయుడు ఈసా, జడ్పీటీసీ సభ్యుడు శేషప్ప, ఎంపీటీసీ సభ్యుడు కంచప్ప పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నూతన ఎంపీడీవో సయ్యద్ ఉమర్ నాయకత్వంలో మండల అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా కృషి చేయాలని కోరారు.సయ్యద్ ఉమర్ మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శక పరిపాలన అందించడమే తన లక్ష్యమని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు మరియు ప్రజలు పాల్గొని నూతన ఎంపీడీవోకు అభినందనలు తెలిపారు.

About Author