పారిశుద్ధ్య నిర్వహణలో అంతరాయం ఉండరాదు
1 min read
నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు, న్యూస్ నేడు: శనివారం నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో ప్రజలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఏవైనా తప్పనిసరి పరిస్థితుల్లో అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు స్పష్టం చేశారు. శనివారం ఆయన రాజ్ విహార్, బుధవారపేట, బిర్లా కాంపౌండ్, క్రిష్ణ నగర్, చెన్నమ్మ సర్కిల్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం సెట్కూరు కార్యాలయం పక్కనున్న అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలోని అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరాయంగా కొనసాగాలని, రోడ్లు, ప్రధాన కూడళ్లు, నివాస ప్రాంతాల్లో ఎక్కడా చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో బాధ్యతగా విధులు నిర్వహించాలని, పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య పనుల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు.


